33.7 C
Hyderabad
April 27, 2024 23: 14 PM
Slider చిత్తూరు

కుప్పంలో పేదల ఇళ్ల కూల్చివేతపై చంద్రబాబు ఆగ్రహం

#Chandrababunaidu

వైసిపి నాయకులు చెప్పేది మాయమాటలు, చేసేది తప్పుడు పనులు.. ఇళ్లస్థలాల్లో భారీ దోపిడికి పాల్పడ్డారు. పేదల ప్రతి పథకాన్ని ఒక కుంభకోణంగా మార్చారు అని చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. కుప్పం ఎమ్మార్వో కార్యాలయం వద్ద టిడిపి ధర్నాను ఉద్దేశించి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

పేదల ఇళ్ల కోసం మనం పోరాటం చేస్తున్నాం. ఇళ్ళస్థలాల్లో అవినీతిపై పోరాడుతున్నాం. టిడిపి వచ్చాకే రాష్ట్రంలో పెద్దఎత్తున పక్కా ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు, ఫక్కా భవనాల్లో ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. టిడిపి ఆవిర్భావానికి ముందు పేదలంతా ఎండకు ఎండి, వానకు తడిసే ఇళ్లలో ఉండేవాళ్లు. ఇళ్ల నిర్మాణంలో బీసిలకు రిజర్వేషన్లు కల్పించాం.

2004-09మధ్య హౌసింగ్ లో ఇష్టారాజ్యంగా దోపిడి

టిడిపి పేదల ఇళ్ల నిర్మాణం దేశానికే నమూనా అయ్యింది. నా సొంత ఇంట్లో నేను ఉంటున్నాననే మనోధైర్యం ప్రతి పేద కుటుంబానికి ఉండాలి. కట్టుకున్న ఇల్లు ప్రతి పేదకుటుంబానికి ఒక ఆస్తిగా ఉండాలి అని ఆయన అన్నారు. 2004-09మధ్య హౌసింగ్ లో ఇష్టారాజ్యంగా దోపిడి చేశారు.

ఉమ్మడి ఏపిలో 14లక్షల ఇళ్లు మాయం చేశారు, కట్టకుండానే బిల్లులు చేసుకున్నారు, 13జిల్లాలలోనే  అప్పట్లో రూ5వేల కోట్ల స్కామ్ లు చేశారు. టిడిపి 5ఏళ్ల పాలనలో 2014-19మధ్య రాష్ట్రంలో 10లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. వైసిపి అధికారంలోకి వచ్చాక 4లక్షల 37వేల ఇళ్లు క్యాన్సిల్ చేశారు.

టిడిపి 2.50 సెంట్లనుంచి 3సెంట్ల ఇళ్లస్థలాలు ఇస్తే ఇప్పుడు వైసిపి నాయకులు సెంటుకే తగ్గించారు అని ఆయన అన్నారు. ఇంటి విస్తీర్ణాన్ని 400 అడుగుల నుంచి 750అడుగులకు పెంచింది టిడిపి ప్రభుత్వమే.. రూ70వేల నుంచి రూలక్షా 70వేలకు పెంచాం. పేదల ఇళ్ల రిపేర్లకు కూడా డబ్బులిచ్చి ఆదుకున్నాం.

కుప్పంలో ఏం పాపం చేశారని పేదలపై దౌర్జన్యాలు?

లక్షలాది ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేయించాం. కుప్పంలో ఏం పాపం చేశారని పేదలపై దౌర్జన్యాలు చేస్తున్నారు.. పేదల ఇళ్లు కూల్చేయడం అమానుషం. పేదల ఇళ్లు ఎందుకు కూల్చేశారో సమాధానం చెప్పాలి. పేదల హవుసింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలి. పట్టణాల్లో ఉచితంగా ఇళ్లు ఎందుకివ్వలేదో జవాబివ్వాలి.

కట్టిన ఇళ్లు ఎందుకు స్వాధీనం చేయలేదో చెప్పాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసిపి కుంభకోణాలకు అంతే లేకుండా పోయింది. ఒక్కో పట్టాకు రూ30వేలు, రూ60వేలు, రూలక్షా 10వేల చొప్పున బలవంతపు వసూళ్ల దందా చేస్తున్నారు.

మీకు చేతకాక మేం అడ్డంపడుతున్నాం అంటారా?

ఇళ్ల పట్టాలకు టిడిపి అడ్డుపడుతోందన్న ఆరోపణలను ఖండిస్తున్నాం. పేదల ఇళ్ల పట్టాలకు మేము అడ్డం పడటం లేదు.. ఇళ్ల పట్టాల ముసుగులో మీరు చేసే అవినీతికి అడ్డుపడుతున్నామే తప్ప ప్రజల మేళ్లకు మేము అడ్డం పడటం లేదు. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు. కుప్పంలో 27మంది ఎస్సీల ఇళ్ల కూల్చివేతలను ఖండిస్తున్నాను.

లబ్దిదారుడి వాటాతో కలిపి రూ5లక్షలతో ఇల్లు కట్టిస్తామని గత ప్రభుత్వం మంజూరు పత్రంలో పేర్కొంది. ఒక హక్కుగా ప్రభుత్వం నుంచి పేదలకు సంక్రమించిన ఇల్లు కూల్చేసే హక్కుగాని, ఇచ్చిన పట్టా రద్దు చేసే హక్కుగాని వీళ్లకు లేదు అని ఆయన అన్నారు.

Related posts

ఇద్దర్ని చంపిన వాడు పంతొమ్మిదేళ్ల కుర్రాడు

Satyam NEWS

జనసేన కి గాజు గ్లాసు గుర్తు కేటాయించలేదు

Bhavani

లాక్ డౌన్: రైతుల పంటలు కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు

Satyam NEWS

Leave a Comment