29.7 C
Hyderabad
May 2, 2024 04: 21 AM
Slider నల్గొండ

మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు మౌలిక సదుపాయాలు

MLALingaiah

ఏ లోటులేకుండా నకిరేకల్ మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం రోజున నకిరేకల్ మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయన వార్డులలో కలియ తిరిగారు.

అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వార్డులలో ఓటర్లను ఆయన నేరుగా కలిశారు అనంతరం వారు వార్డు కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆదర్శవంతంగా నకిరేకల్ మున్సిపాలిటీని తీర్చిదిద్దేందుకు తాను శాయశక్తులా కృషిచేస్తామని అన్నారు.

పేదరిక నిర్మూలనే కేసీఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో,మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో 8 కోట్ల రూపాయలతో నకిరేకల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

గజ్వేల్ తరహాలో నకిరేకల్ లో స్మశానవాటిక నిర్మాణాన్ని అతిసుందరంగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. మాయమాటల మోసగాళ్లను నమ్మొద్దని పనిచేసే వారికే పట్టం కట్టాలని ఆయన అన్నారు. అన్నివర్గాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

నకిరేకల్ మున్సిపాలిటీ లో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. 50 లక్షల రూపాయలతో బస్ స్టాండ్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి పట్టణ, మండల, పరిసర ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపామని ఆయన తెలిపారు.

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిరేకల్ మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్, డివైడర్ లను ఏర్పాటు చేసి రోడ్డు మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి నకిరేకల్ మున్సిపాలిటీ అభివృద్ధి భాగస్వాములవ్వాలని ఆయన కోరారు.

Related posts

మా వద్ద 24 గంటలు ఇసుక సప్లయ్ చేయబడును

Satyam NEWS

ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం

Bhavani

సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన అధికారులు

Satyam NEWS

Leave a Comment