26.7 C
Hyderabad
May 3, 2024 10: 12 AM
Slider పశ్చిమగోదావరి

సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన అధికారులు

#pedavegi

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి షెడ్యూల్ కులాల సాంఘీక సంక్షేమ  ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో పెదవేగి స్పెషల్ ఆఫీసర్, పెదవేగి ఎం పి డి ఓ రాజ్ మనోజ్, తహసీల్దార్ ఎన్ నాగరాజు సోమవారం సందర్శించారు.

వసతిగృహ పరిసరాల పరిశుభ్రత, త్రాగునీరు, విద్యార్థులకు రోజువారీగా అందించే ఆహార పదార్థాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం లో ఉంటున్న విద్యార్థులకు కాస్మెటిక్స్, ట్రంకు పెట్టెలు, వసతిగృహ యూనిపార్మ్స్ సక్రమంగా అందుతున్నాయా అని అడిగారు.

కలెక్టర్ ఆదేశాలతో వసతి గృహ పరిశీలనకు వెళ్లిన అధికారుల బృందం కళ్ళకు స్నానాల గదులకు, టాయిలెట్ రూమ్ లకు కొన్నింటికి   తలుపులు లేకపోవడం, విద్యార్థులకు అవసరమైనంత నీరు సరఫరా లేని పరిస్థితి, విద్యార్థులు నిద్రించే గదుల కిటికీలకు దోమతెరలు( మెష్)లు లేవని అధికార బృందం గ్రహించి వసతి గృహం లో విద్యార్థులు ఎదుర్కుంటున్న అత్యవసర సమస్యలను జిల్లా అధికారులకు వివరించనున్నామని పెదవేగి అధికారులు తెలిపారు. పనిలోపనిగా కూచింపూడి సచివాలయాన్ని, జగనన్న కాలనీ ని పరిశీలించినట్టు అధికారులు తెలిపారు.

Related posts

వనపర్తిలో విలేకరులకు అవమానం

Satyam NEWS

ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద రాణిరుద్రమ నిరసన

Satyam NEWS

ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గా ఎన్నికైన బిజి క్లెమెంట్

Bhavani

Leave a Comment