39.2 C
Hyderabad
May 3, 2024 12: 48 PM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు చెంచులకు అందాలి

#mannanurITDA

చెంచుల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను ఐటిడిఏ ద్వారా పూర్తి స్థాయిలో అమలు చేసి చెంచులు ఆర్థికంగా ఎదగాలా కృషి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. బుధవారం మన్ననూర్ ఐటిడిఏ కార్యాలయంలో ఐటిడిఏ అధికారులు, ఆర్డిటి ప్రతినిధులతో చెంచుల ఇండ్ల నిర్మాణాలు, ఆరోగ్య సదుపాయాలు, విద్యాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెంచుల అభివృద్ధికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్న కృషికి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాల్లోని చెంచులకు 102 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, వాటి నిర్మాణాలను అక్టోబర్ నాటికి పూర్తి చేసి చెంచులకు అందించాలని సూచించారు.

అదేవిధంగా మరో 400 ఇండ్లను కాంక్రీట్ సిమెంట్,ఇనుము అవసరం లేకుండా ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఆధునిక హంగులతో ఇంటిని నిర్మించి అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అందుకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలోని 29 హాస్టల్ ల వార్డెన్ లతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు తాగేందుకు వేడినీటిని అందించాలన్నారు.

విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల విద్యా నైపుణ్యాలపై దృష్టి సారించేలా విద్యా సంవత్సరం ఆరంభం నుండే ప్రణాళికాబద్ధంగా విద్యనందించాలన్నారు. పదో తరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులను ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

హాస్టళ్ల రిపేర్లను పూర్తి చేయించుకోవాలన్నారు. అందుకు కావలసిన 80 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఐటీడీఏ ద్వారా నిర్మిస్తున్న డయాగ్నోస్టిక్ హబ్, వ్యాధి నిర్ధరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. నిర్మాణం పూర్తి అయితే నల్లమల్ల ప్రాంతంలోని చెంచులకు, ఇక్కడి ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. వారు తీసుకునే ఆహారం, కాలుష్యం ప్రభావంతో అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయని, వ్యాధి చికిత్స కంటే.. రోగ నిర్ధరణకే వివిధ పరీక్షలంటూ ఎక్కువ ఖర్చుపెట్టాల్సి వస్తోందని, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు మెరుగుపడినా… నిర్ధరణ పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లపైనే ఆధారపడాల్సి పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం డయాగ్నోస్టిక్ హబ్ పేరుతో వ్యాధి నిర్ధరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు.

వ్యాధి నిర్ధారణ కేంద్రం పూర్తి అయితే 23 రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించేందుకు వీలుంటుంది అన్నారు. అదనపు కలెక్టర్ మనూ చౌదరి, పిఓ ఐటిడిఏ అశోక్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ జ్యోతి, ఆర్డీవో పాండు నాయక్, ఆర్డిటి ప్రతినిధులు రామ్మోహన్, రాధా, వార్డెన్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

హుజూర్‌నగర్ ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

మునుగోడు ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తి

Murali Krishna

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment