42.2 C
Hyderabad
May 3, 2024 16: 13 PM
Slider ఆధ్యాత్మికం

రాష్ట్ర మంతటా వేదవ్యాసుని జయంతి వేడుకలు..!

#gurupoornima

పలు ఆశ్రమాలలో గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు.

“వ్యాసం వశిష్ట నప్తారం

శక్తేః పౌత్రమ కల్మషం పరశరాత్మజం వందే

శుక తాతం తపోనిధిం..”..

అంటూ ప్రపంచ వ్యాప్తంగా భగవాన్ వేద వ్యాసుడిని స్తుతించారు. ఏపీ రాష్ట్రంలో… వేలివెన్ను..కామన్నవలస, భవనాపురం లో ఉన్న ఆశ్రమాలలో గురుపౌర్ణమి వేడుకలు జరిగాయి. ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి శ్రీ భగవాన్ వేద వ్యాసుని జయంతి నేపథ్యంలో విజయనగరం జిల్లాలో బాడంగి మండలం లోని కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో తెల్లవారుజామున నుంచీ ప్రాణాయామంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ.. డా.వెంకటేశ్వరరావు..నేతృత్వంలో ఆశ్రమానికి వచ్చిన శిష్యులందూ నిత్య పూజలో పాల్గొన్నారు. కాగా.. గడచిన నలభై రోజుల నుంచీ ఆశ్రమంలో స్వామిజీ సమాధి మందిరంలో ప్రారంభమైన అఖండ జపం…గురుపౌర్ణమి రోజైన 13వ తేదీన సాయంత్రం.. మంగళహారతి తో పూర్తయింది. ఈ ఉత్సవానికి.. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున శిష్యులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఫియర్: నిర్మల్ పట్టణంలో హైఎలర్ట్

Satyam NEWS

అడగకుండానే ఆడపడుచుల పెళ్ళిళ్ళకు చేయూత.

Sub Editor 2

సినీ నటుడుగా మారిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Satyam NEWS

Leave a Comment