Slider వరంగల్

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలి: డిజిపి

#mulugupolice

తెలంగాణ డిజిపి ఎం.మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా సేవలు అందిస్తూ వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలని నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా  దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.

అదేవిధంగా నిఘా వ్యవస్థకు ప్రధాన వనరుగా మారిన సీసీ టీవీల వల్ల భద్రతా ప్రమాణాలు పెరుగుతున్న నేపథ్యంలో నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నేరం చేసే వాడికి శిక్ష పడాలి నేరం చేయని వారికి రక్షణగా ఉండాలనే లక్ష్యంతో టెక్నాలజీ పరమైన సంస్కరణలు తీసుకురావడం తద్వారా మంచి ఫలితాలు ప్రజలకు అందాలనే సంకల్పం లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.

మహిళల భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ నాణ్యమైన, సత్వర సేవలు అందించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించడం, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు వివిధ శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ అమలుపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ఫలితాలు రాబట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏ ఎస్ పి గౌస్ ఆలం, ఎస్ బి ఇన్స్పెక్టర్ రెహమాన్, డి సి ఆర్ బి ఎస్ ఐ చైతన్య చందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిద్దిపేట మీదుగా జాతీయ రహదారి: గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం

Satyam NEWS

ఆచార్య ప్రీరిలీజ్ కు సీఎం జగన్ రావడం లేదా?

Satyam NEWS

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కలెక్టర్ సందేశం

Satyam NEWS

Leave a Comment