30.7 C
Hyderabad
April 29, 2024 04: 54 AM
Slider చిత్తూరు

దేవుని దర్శనాల పేరుతో ఎమ్మెల్యేల దోపిడీ

#TTD

వైకాపా ఎమ్మెల్యేలు కొంతమంది తిరుమల శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులను మోసంచేసి లక్షలు దోచు కుంటున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కొవిడ్ సమస్య వల్ల సర్వదర్శనం అపేసి పరిమిత సంఖ్యలో 300 రూపాయల టిక్కెట్ పై దర్శనాలు చేయిస్తున్నారని తెలిపారు.

అలాగే సిఫార్సు లేఖలు ఉన్నవారికి 500 రూపాయల టిక్కెట్ పై విఐపి బ్రేక్, ప్రోటోకాల్ దర్శనాలకు అనుమతి ఇస్తున్నారన్నారు. కాగా శ్రీవాణి ట్రస్టుకు 10వేలు డొనేషన్ కట్టిన వారికి 500 రూపాయల టిక్కెట్ పై ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నారని చెప్పారు.

అయితే జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు సంపన్నులు, వ్యాపారవేత్తల వద్ద శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక్కొక్కరి వద్ద 10,500 తీసుకుని గ్రూపుగా ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఒక్కొక్కరి నుంచి 10 వేలు చొప్పున మిగుల్చుకుంటున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు ఈ దర్శనాలను పెద్ద వ్యాపారంగా కొనసాగిస్తున్నారని చెప్పారు.

ఒక్కో గ్రూపు సంఖ్యను బట్టి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వరకు మిగుల్చు కుంటున్నారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యే నెలలో కనీసం ఐదు, పది సార్లు దర్శనాలు చేయించి లక్షలు గడిస్తున్నారని తెలిపారు. కొన్నిసార్లు ఎమ్మెల్యేలే స్వయంగా దర్శనాలు చేయిస్తున్నారని , వారికి వీలు కానప్పుడు కొడుకులు, అల్లుళ్లను పంపి దోచుకుంటున్నారని విమర్శించారు.

టీటీడి ప్రోటోకాల్ దర్శనాల వివరాల జాబితా బయట పెడితే అన్నీ వెలుగులోకి వస్తాయన్నారు. ప్రభుత్వం విచారణ సంస్థను నియమిస్తే  మంత్రి, ఎమ్మెల్యేల పేర్లు, ఇతర వివరాలు వెల్లడిస్తానని సుధాకర్ రెడ్డి చెప్పారు.

Related posts

చకోర రవం

Satyam NEWS

మంచి దృక్పథమే విజయానికి సోపానం

Satyam NEWS

రైతు ఆత్మహత్య ఎఫెక్ట్.. రాజీనామాల పర్వం

Satyam NEWS

Leave a Comment