36.2 C
Hyderabad
May 12, 2024 15: 13 PM
Slider ముఖ్యంశాలు

కేటీఆర్.. దమ్ముంటే రా.. ధరణితో రైతుల సమస్యలు చూపిస్తా

అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడటం లేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కేటీఆర్.. దమ్ముంటే రా.. ధరణితో రైతుల సమస్యలు చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. కేటిఆర్ కు కళ్ళు కనపడటం లేదా.. లేక కళ్ళకు గంతలు కట్టుకున్నాడా అని ప్రశ్నించారు. ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించిన షబ్బీర్ అలీ ధరణి పోర్టల్ లో తాను కూడా బాధితుడినేనని తెలిపారు.

హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలో చేపట్టిన పాదయాత్ర కార్యక్రమంలో షబ్బీర్ అలీతో పాటు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 4080 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టారన్నారు. అధాని, అంబానిలపై రాహుల్ గాంధీ మాట్లాడితే బీజేపీ ఒంటికాలిపై లేచిందన్నారు.

నేడు అధానిపై దేశమంతా మాట్లాడుతుందన్నారు. 10 లక్షల కోట్ల భారత ప్రజల సొమ్ము షేర్ మార్కెట్లో నష్టం జరిగిందన్నారు. నాడు అధాని 609 వ స్థానంలో ఉంటే నేడు 3 వ స్థానానికి వచ్చారని, దానికి కారణం ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు నుంచి మోదీ పారిపోయారని, కర్ణాటక పర్యటనలో మోదీని ఎవరు పట్టించుకోలేదని విమర్శించారు. భారత్ జోడో యాత్రతో దేశాన్ని ఏకం చేయాలని రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే బీజేపీ మాత్రం మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని విభజించే కుట్ర చేస్తుందని ఆరోపించారు.

గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, ఈ అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని పేర్కొన్నారు. వరికి 2500 మద్దతు ధర ఇస్తామని, ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న ఆయన గతంలో 72 వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. డ్వాక్రా సంఘాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సంఘాలకు ప్రభుత్వం 4250 కోట్లు బకాయి ఉందన్నారు.

కామారెడ్డిలో కొందరు నాయకులు డ్వాక్రా మహిళల సమస్య పరిష్కరిస్తామని చెప్తున్నారని, ఇది కేవలం కామారెడ్డి సమస్య కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఉందని బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డినుద్దేశించి అన్నారు. విద్యుత్ డిస్కంలకు ప్రభుత్వం 45 వేల కోట్లు బకాయి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని కేంద్రం చెప్తుందన్నారు.

ఈ అప్పు కాంగ్రెస్ హయాంలో 75 వేల కోట్లు మాత్రమే ఉండదన్నారు. ఈ డబ్బంతా కేసీఆర్ కుటుంబంలోనే తిరుగుతుందని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం 20, 21, 22 ప్యాకేజి తయారు చేసామని, ఈ ప్యాకేజీల ద్వారా నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తే కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు 3 లక్షల 56 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మొన్నటి అసెంబ్లీలో ప్రాజెక్టు పనుల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రికి దమ్ముంటే కేసీఆర్ ను నిలదీసి అడగాలని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు మునిగిపోతే ప్రతిపక్షాలు వెళ్ళడానికి అనుమతి ఇవ్వరని, సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగితే సందర్శనకు నిరాకరిస్తారని, వెళ్తామని ప్రకటిస్తే హౌస్ అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేమైన కేసీఆర్, కేటీఆర్ జాగీరా అని నిలదీశారు. మీ సొంత ఆస్తులా అని ప్రశ్నించారు. ఇవన్నీ సమస్యలపై హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్తుందన్నారు. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ నెల 17 న కామారెడ్డి నాయకులు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు.

Related posts

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే బేతి

Satyam NEWS

కట్టలు తెగిన కరెన్సీ.. ఓటుకు రూ.3 వేలు!

Satyam NEWS

నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన హుజూర్ నగర్ ప్రైవేట్ టీచర్లు

Satyam NEWS

Leave a Comment