40.2 C
Hyderabad
May 6, 2024 17: 22 PM
Slider రంగారెడ్డి

నిజాంపేట్ కార్పొరేషన్ లో రోజుకో కబ్జా

#nizampet

నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు ఒక కబ్జా జరుగుతుందని, దానికి నిదర్శనమే నిజాంపేట్ సర్వే నెంబర్ 348 తుర్కచెరువులో 2000 ఎఫ్ టి ఎల్ స్థలం దర్జాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఫెన్సింగ్ వేసుకుంటున్నారని బిజెపి ఆరోపించింది. ఈ కబ్జాదారులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఈరోజు బాచుపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో, నిజాంపేట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షులు ఆకుల సతీష్ మాట్లాడుతూ నిజాంపేట్ గ్రామం సర్వేనెంబర్ 348 శ్రీ చైతన్య కాలేజ్ పక్కనే గల తురకచెరువు ఎఫ్ టి ఎల్(R39-R43) వరకు ఎఫ్ టి ఎల్ స్థలం ఆక్రమించుకొని దర్జాగా చెరువును పూడ్చివేసి ఫెన్సింగ్ గత మూడు రోజులుగా పనులు జరుగుతున్నాయి. దీనిపై మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లిన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. చెరువులో ఇప్పటికే  శ్రీ చైతన్య కాలేజ్ కిచెన్ షెడ్డు పూర్తిగా బఫర్ జోన్లే నిర్మాణం జరిగినా చర్యలు తీసుకోలేని అధికారులు మరొకసారి చెరువులో కూకట్పల్లి దొరలు చెరువు ఎఫ్ టి ఎల్లోనే కబ్జాపెట్టి, ఆక్రమించుకోవడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణించింది.

తక్షణమే ప్రభుత్వ భూమి వరకు సర్వే చేయాలని, చెరువులో ప్రస్తుత కబ్జాదారుడు గతంలో కాలేజ్ భవన్ నిర్మాణం కిచెన్ షెడ్ ని తొలగించడమే కాకుండా కాలేజీ కొంత భాగం సర్వే నెంబర్ 334లో ఆక్రమించుకోవడంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

అదేవిధంగా ఎఫ్ టి ఎల్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అదే విధంగా బండారు లేఔట్ సర్వే నెంబర్ 82 చెరువు కట్ట భాగాన్ని చదును చేయడం, ప్రభుత్వ భూమిని చదును చేసి కబ్జాపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి బిక్షపతి యాదవ్ సెక్రెటరీ ,ప్రసాద్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు అశోక్ నాయక్, కిసాన్ అధ్యక్షులు ప్రసాద్ రాజు సీనియర్ నాయకులు జగదీష్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

మీరు…పోర్ట్ ఎస్టేట్…. మీ స‌హాకారం ఎంతో అవ‌స‌రం..!

Satyam NEWS

వంద మంది వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు ఉపయోగించుకోవాలి

Satyam NEWS

Leave a Comment