38.2 C
Hyderabad
May 3, 2024 22: 52 PM
Slider కడప

బాబుతో ఫొటోనే మిగిలింది వై ఎస్ తో అందలం దక్కింది

Iliyas

టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో దిగి చేతిలో పెడితే వైసీపీ అధినేత జగన్ బాబు ఏకంగా ఏ.పి.యన్.ఆర్.టి.యస్ డైరక్టర్ పదవి చేతిలో పెట్టాడు. వైసీపీ ఆవిర్భావం నుంచి కువైట్ గల్ఫ్ వైడ్ వైస్సార్ వైసీపీ అభిమాన సంఘం అధ్యక్షుడు బి.హేచ్.ఇలియాజ్ ప్రస్థానం ఇదీ.

కువైట్ లో బి.హెచ్ .ఇలియాజ్ కువైట్ తెలుగుదేశం పార్టీ అభిమాన సంఘం తో తన ప్రస్థానం ప్రారంభించారు. కడప జిల్లా నుంచి ముఖ్యంగా రాజంపేట అసెంబ్లీ నుంచి పెద్ద సంఖ్యలో జీవనాధారం నిమిత్తం వేల సంఖ్యలో కువైట్లో ఉన్నారు. బి.హెచ్ .ఇలియాజ్ కూడా రాజంపేట ప్రాంతానికి చెందిన వాడే జిల్లా వ్యాప్తంగా బంధువర్గం ఉంది.

స్వతహాగా టీడీపీ అభిమాని అయిన అక్కడ ప్రభుత్వ శాఖలో పని చేస్తూనే ప్రవాసాంధ్రులతో కలిసి టీడీపీ తరపు అనేక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేశారు. ఈ క్రమంలో 2009 లో పార్టీ గెలుపు కోసం అక్కడ నటి రోజా, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేమన సతీష్ ,గోవర్ధన్ రెడ్డి ,జి.యన్.నాయుడు, పాలకొండరాయుడు, రఘురామిరెడ్డి, ఫారూక్, మోహన్, సుబాన్ బాషా తదితరులతో ప్రవాసాంధ్ర గర్జన అనే కార్యక్రమంను భారీగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం తరువాత కువైట్ టీడీపీ లోని కొందరు స్వార్ధ కుల రాజకీయాలు నడిపారు. ఆక్రమంలో బి.హెచ్.ఇలియాజ్ ఆధిపత్యంను తగ్గించేందుకు కడప నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు కుట్రలు, కుతంత్రాలు నడిపారు.

పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు వద్ద కూడా జిమ్మిక్కులు చేసి టీడీపీ కువైట్ లోని ఓ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇలియాజ్ కు ద్రోహం తలపెట్టారు. వారి స్వార్ధం కోసం పొమ్మన లేక పొగ పెట్టడంతో గుర్తింపు లేనిచోట, కులం పేరిట ఆధిపత్యం ఉన్న చోట తాను ఇమడలేక అప్పటికే ఆర్థికంగా చితికి పోయిన ఆయన టీడీపీ పరాజయం చెందడం తో వై.యస్.రాజశేఖర్ రెడ్డి కలిసి నడిచారు.

ఆయన మరణం తరువాత వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కువైట్ లో గల్ఫ్ వైడ్ వైస్సార్ అభిమాన సంఘం స్థాపించి అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం పూర్తి సహకారంతో సేవా కార్యక్రమాలు చేశారు. దీనితో ఆయన కువైట్లోను ,కడప జిల్లా లోను, పార్టీ అధిష్టానం దృష్టిలో ఆయన పట్టు సాధించారు. ఈ నేపధ్యంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారం లోనికి రావడంతో ఆయనకు అదృష్టం వరించింది.

ఏ.పి.యన్.ఆర్.టి.యస్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. విజయవాడ తాడేపల్లి పల్లెల్లో ఏ.పి.యన్.ఆర్.టి.యస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. గల్ఫ్ కన్వీనర్ ఇలియాజ్ కష్టానికి తగిన గుర్తింపు టీడీపీ నుంచి కాకుండా వైసీపీ ని నమ్ముకొని పనిచేసి నందుకు ఆయన అనుచరులు ఉబ్బి తబ్బిబ్బు ఔతున్నారు.

కులం స్వార్ధం అనేవి చూడకుండా సమర్థతకు చోటు కలిపిస్తే ఫలితం కూడా అలాగే ఉంటుందని అందుకు ఇలియాజ్ సంఘటన ఉదాహరణ అని ఆయన వర్గీయులు సంబరాలు జరుపు కుంటున్నారు.కడప ఎమ్మెల్యే గెలుపోటములకు మైనారిటీ వోట్లు అధికం కావడం వారే కీలకం. ఇలియాజ్ భవిష్యత్ లో అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరుపున ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే బాగుంటుందని మరింత పార్టీ కి ,ప్రజలకి సేవ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Related posts

మేడారం జాతర పనులపైన నిర్లక్ష్యం వద్దు

Satyam NEWS

యుద్ధప్రాతిపదికన వేములవాడ లో వంద పడకల ఆసుపత్రి

Satyam NEWS

మంత్రి నిరంజన్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజానేత వాకిటి

Satyam NEWS

Leave a Comment