28.7 C
Hyderabad
April 26, 2024 10: 39 AM
Slider సినిమా

పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన ‘ఎక్కడికో ఈ అడుగు’

#NewMovie

‘ఎఫెక్ట్స్ రాజు’గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన శ్రవణ్ బొనగాని దర్శకత్వంలో ‘స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’.

గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది.

త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేసుకోనున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: ఆరె వెంకటేష్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్,

సంగీతం: దిలీప్ బండారి, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రవణ్ బొనగాని

Related posts

ప్రొటెస్ట్:ఆన్ లైన్ లోనే అమ్ముకోండి మేమెందుకు?

Satyam NEWS

“రాజుల” నగరంలో చవితి సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లు..!

Satyam NEWS

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యల పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment