27.7 C
Hyderabad
May 14, 2024 05: 20 AM
Slider ప్రత్యేకం

పిల్ల‌ల‌ను పెంచ‌డంలో అమ్మ‌తో పాటు నాన్న పాత్ర కూడా కీల‌కం…!

పిల్ల‌ల పెంప‌కంలో త‌ల్లిది ఎంత బాధ్య‌త ఉందో…తండ్రి దీ అంతే బాధ్య‌త ఉంద‌ని ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపిక అన్నారు. స‌మాజంజ‌లో ఒక్క అమ్మాయిలు స‌క్రమంగా ఉండ‌టం స‌రికాద‌ని..అబ్బాయిలు కూడా మంచి ప్ర‌వ‌ర్త‌న‌తో మెల‌గాలని ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ దీపిక అన్నారు.

జిల్లాలో ప‌దిరోజుల పాటు కొన‌సాగిన దిశ జాగృతి యాత్ర ముగింపు సంద‌ర్బంగా న‌గ‌రంలోని క‌స్పా హైస్కూల్ లో విద్యార్ధినీ, విద్యార్దుల‌తో నిర్వ‌హించిన సభా కార్య‌క్ర‌మంలో ఎస్పీ మాట్లాడారు. నాకు ఓ బాబు,భ‌ర్త ఉన్నార‌ని…అలాగే అమ్మ‌,నాన్న లు ఉన్నార‌ని అది కాదని ప్ర‌తీ ఒక్క‌రికి ఓ గుర్తింపు ఉండాల‌ని…ఎస్పీ అన్నారు.

ప్ర‌పంచంలోస్త్రీ,పురుషులిద్ద‌రికి అవ‌కాశాలువ‌స్తున్నాయని..స‌మాజంలో ఇద్ద‌రూ స‌మాన‌మేన‌ని…కుటుంబ బాద్య‌త‌ల‌తో పాటు స‌మాజంలో పిల్ల‌ల‌ను పెంచ‌డంలో అమ్మ‌తో పాటు నాన్న‌ది పాత్ర కూడా కీల‌క‌మ‌ని ఎస్పీ అన్నారు. ఏండ్రియ‌డ్ తో స్మార్ట్ ఫోన్ వ‌చ్చిన ఈ ఆధునిక యుగంలో యూట్యూబ్ లో ఏవి చూడాలో ఏవి చూడ‌కూడ‌దో మీకు తెలుసున‌ని.ఉప‌యోగ‌ప‌డే విధంగా ఉన్న అంశాల‌ను చూడాల‌ని ఈవిష‌యం చెప్పించుకునే స్థాయిని అర్ధం చేసుకునే మైండ్ ఉన్న మీరు..త‌ద‌నుగుణంగా ఉండాల‌ని ఎస్పీ అన్నారు.

ఇక సమాజం ప‌ట్ల బాధ్య‌త అటు అమ్మాయికి ఉంది ఇటు అబ్బాయికి ఉంద‌న్నారు.మ‌రీ ముఖ్యంగా అమ్మాయిలు..తొంద‌ర పాటు నిర్ణ‌యాలు..క్ష‌ణికావేశాలువ‌ద్ద‌ని అమ్మ అవ్వాల‌న్నా…ఆలోచ‌న‌ల‌ను ప్ర‌స్తుతం ప‌క్క‌న పట్టి…నేను నిల‌బ‌డాల‌ని…ఎవ్వ‌రిపైనా ఆదార‌ప‌డొద్దు…త‌న‌నుక‌న్న‌వారిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని అన్న ల‌క్ష్యంతో అమ్మాయిలు ముందు అడుగు వేయాల‌ని ఎస్పీ అన్నారు.

కార్యక్ర‌మంలో టెన్త్ చ‌దువుతున్నకీర్త‌న్ అనే అమ్మాయి ఇంగ్లీషు లో మాట్లాడి…పోలీస్ అధికారుల‌ను విస్మ‌రింప చేసింది. స‌భావేదిక‌ముందే అంద‌రి విద్యార్ధులుండ‌గానే…స్కూల్ అయిపోగానే పోకిరీలు బెడ‌త ఎక్కువైపోతోంద‌ని…ఓ పాయింట్ పెట్టాల‌ని ధైర్యంగా…పోలీస్ బాస్ ను కోర‌డం విశేషం.

ముగింపు కార్య‌క్ర‌మానికి విజ‌య‌న‌గ‌రం క‌స్పాను ఎంద‌కు ఎంచుకున్నారంటే…!

దాదాపు 150 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన క‌స్పా హైస్కూల్…కొత్త ,న‌వ‌త‌రానికి అందునాయువ‌త పెడత్రోవ పెట్ట‌కుండా ఉండేందుకు నాందీ ప‌లికింది. ఈ నెల 21 జిల్లా కేంద్రంలోని బ్యారెక్స్ లో దిశ జాగృతి యాత్ర ప్రారంభమైంది. ప‌ది రోజు ముగింపు ఎక్క‌డ పెడ‌దామ‌ని యాత్ర ప్ర‌ళాళిక క‌ర్త ఏఎస్పీ ఆలోచిస్తున్న త‌రుణంలో న‌గ‌రంలోని క‌స్పా స్కూల్ లో టెన్త్ విద్యార్ధిని..ఇటీవ‌లే..సింగ్ పూర్ సిటీకి చెందిన అబ్బాయితో ప్ర‌మే లో పడింది.

మేజ‌ర్ కాని అమ్మాయి..క్షణిక ఆనందంలో ప్రేమైకంలో ప‌డింద‌న్న విష‌యం…ఫిర్యాదు ద్వారా తెలుసుకున్న టూటౌన్ ఎస్.ఐ సాగ‌ర్ బాబు…ఓ రోజు అదే పాఠ‌శాల‌లో విద్యార్ధినీల‌తో స‌మావేశ‌మై వాళ్ల‌ను చైత‌న్య‌ప‌రిచే కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.విష‌యం కాస్త ఏఎస్పీ వ‌ర‌కు వెళ్ల‌డంతో స్వ‌యంగా ఎస్ఐతో మాట్లాడి..త‌ద్వారా టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావుతో క‌ల‌సి..ఆస్కూల్ కు వెళ్లి..హెచ్ ఎంతో మాట్లాడి.దిశ జాగృతి యాత్ర ముగింపు ఉత్స‌వానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏఎస్పీ విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్,ఏఎస్పీ స‌త్య‌నారాయ‌ణ‌, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి,దిశ‌డీఎస్పీ త్రినాధ్, స్పెష‌ల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస‌రావు, రుద్ర‌శేఖర్, డీసీఆర్బీసీఐ డా.బి.వెంక‌ట‌రావు,వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ,రూర‌ల్ సీఐ మంగ‌వేణి, రూర‌ల్ ఎస్ఐ నసీం, గుర్ల ఎస్ఐ శిరీష,నెల్లిమ‌ర్ల ఎస్ఐ నారాయ‌ణ‌,గంట్యాడ ఎస్ఐ కిర‌ణ్ కుమార్ నాయుడు, వ‌న్ టౌన్ ఎస్ఐ అశోక్, లు పాల్గొన్నారు.

ఎం. భరత్ కుమార్, సత్యం న్యూస్. నెట్, విజయనగరం

Related posts

విజ్ఞానఖని

Satyam NEWS

బీసీ రుణ సదుపాయంలో గౌడ్స్ కు స్థానం కల్పించాలి

Bhavani

ట్యాంక్ బండ్ పై భగీరథుడి విగ్రహం

Satyam NEWS

Leave a Comment