33.7 C
Hyderabad
April 29, 2024 01: 24 AM
Slider ఆధ్యాత్మికం

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

#tirupati

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఉదయం 9.15 నుండి 9.45 గంటల మధ్య వృష‌భ‌లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.

అంతకుముందు ఉదయం 7.30 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంత‌రం ఉదయం 9.45 నుండి 10 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.

అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, ఆగ‌మ స‌ల‌హాదారు విష్ణుభ‌ట్ట‌చార్యులు, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్‌ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం‌, జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

జిన్నాపై సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన వ్యాఖ్యలు

Sub Editor

ట్రాజెడీ: ప్రేమ విఫలమై బావిలో దూకిన యువతి

Satyam NEWS

హిందూ ధర్మానికి అడ్డొస్తే మెడలు వంచుతాం

Satyam NEWS

Leave a Comment