36.2 C
Hyderabad
May 12, 2024 18: 27 PM
Slider ఆంధ్రప్రదేశ్

జగన్ అక్రమాస్తుల కేసు డిసెంబర్ 6కి వాయిదా

jagan cabi

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మొత్తం 11 చార్జిషీటులకు సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 6కి వాయిదా వేసింది. ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. కేవలం ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ మాత్రమే హాజరయ్యారు. 15 రోజుల క్రితం జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడం సాధ్యంకాదని, ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నందున ఆయన కోర్టుకు హాజరు కాలేరంటూ జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Related posts

డిమాండ్: బత్తాయి మామిడి రైతును ఆదుకోండి

Satyam NEWS

మహిళశక్తి టీంని అభినందించిన పొంగూరు రమాదేవి

Satyam NEWS

సెలబ్రేషన్: కాచిగూడలో శ్యామ్ బాబా ఫాల్గుణి వేడుకలు

Satyam NEWS

Leave a Comment