నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్ లో సి.సి.రోడ్డు కు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజవర్గంలో 50 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాబాటకు వచ్చి పది రోజులు గడవకముందే వచ్చి ఈ రోడ్డు శంకుస్థాపన చేసిన దానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లకు స్థానిక ప్రజలు కృతఙ్ఞతలు తెలిపారు.
previous post