27.7 C
Hyderabad
May 14, 2024 06: 51 AM
Slider హైదరాబాద్

ఈసీ, పోలీసులు, టీఆర్ఎస్ తీరుకు డీకె అరుణ ఉప‌వాస దీక్ష‌

dk-3

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏవిధంగా నైనా గెలవాలనే దురుద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసింద‌ని విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, మద్యం పంపిణీపై ప్ర‌శ్నిస్తున్నందుకు బిజెపి కార్యకర్తలపై దాడుల‌కు పూనుకుంటోంద‌ని ఇదంతా చూస్తూ కూడా ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ‌త్తాసు ప‌లుకుతున్నారంటూ బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలు డీకె. అరుణ ఒక‌రోజు ఉప‌వాస దీక్ష‌కు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర‌జాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఖూనీ చేస్తుంటే అధికార యంత్రాంగం మాత్రం బీజేపీ పార్టీపై విరుచుకుప‌డ‌డాన్ని నిర‌సిస్తూనే ఉప‌వాస దీక్ష‌కు పూనుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అంద‌రూ చూస్తుండ‌గానే గులాబీ నేత‌ల వ‌ద్ద డ‌బ్బులు ప‌ట్టుబ‌డుతున్నాయి, మ‌ద్యం సీసాలు స్వాధీనం చేసుకుంటున్నారు. మైలార్‌దేవ్‌ప‌ల్లి, చైత‌న్య‌పురి, ఇలా అనేక చోట్ల‌ను ఆమె ఉదాహ‌ర‌ణ‌గా వివ‌రించారు. అధికార యంత్రాంగం తీరుకు నిర‌స‌న చేప‌ట్టిన‌ట్లు డీకె. అరుణ స్ప‌ష్టం చేశారు. ఉప‌వాస దీక్ష‌లో పార్టీ నేత‌లు ల‌క్ష్మ‌ణ్‌, వివేక్‌లు పాల్గొన్నారు.

Related posts

జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర

Murali Krishna

రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి!

Bhavani

ప్రచారం ముగిసినా రోడ్లపైనే ఉన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment