ఉగ్రవాదానికి సహకరిస్తున్నాడనే ఆరోపణలతో సస్పెండ్ అయిన కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవీందర్ సింగ్‌కు జమ్ములోని ప్రత్యేక కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. అలాగే ఈ కేసుకు సంబందించిన మరో ముగ్గురిని కూడా కోర్టు ఇవాళ ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. అయితే బుధవారం శ్రీనగర్‌లోని ఆయన ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.
కాగా దేవీందర్ సింగ్ కశ్మీర్ నుంచి ఉగ్రవాదులను తరలించేందుకు సాయం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నరు.ఐతే అతనికి ఎలాని ప్రభుత్వ పురస్కారాలు ఇవ్వలేదని కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.అతన్ని కూడా ఉగ్రవాది గానే చూస్తున్నామని పోలీస్ లు ప్రకటించారు.