32.2 C
Hyderabad
May 8, 2024 11: 22 AM
Slider ముఖ్యంశాలు

కౌంటర్: జగన్ కు మినహాయింపు ఇవ్వద్దని కోరిన సీబీఐ

jagan jail

అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సీబీఐ కోర్టుకు హాజరు కావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ తరపు న్యాయవాదులు కోరారు. ఈ కేసుల్లో ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.

జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వొదని సీబీఐ కోరింది. జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని,  మినహాయింపు ఇవ్వకుండా విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పై ఏప్రిల్ 9న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.

Related posts

పోలీసు ఉద్యోగార్ధులకు శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రంలో పాలు పంపిణీ

Satyam NEWS

లిక్కర్ స్కాం: ఏరులైపారుతున్న మధ్యప్రదేశ్ మద్యం

Satyam NEWS

విద్యార్థుల‌కు డ్రగ్స్ విక్ర‌యిస్తున్న ముఠా గుట్టురట్టు

Satyam NEWS

Leave a Comment