40.2 C
Hyderabad
April 29, 2024 18: 09 PM
Slider ఆదిలాబాద్

గుడ్ ఇనీషియేటీవ్: మహిళా పోలీసులకు మొబైల్ వాష్ రూం

nirmal police 12

మహిళల కోసం ప్రవేశపెట్టిన మొబైల్ టాయిలెట్ వాహనాన్ని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు నేడు నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విభాగం తన మహిళా సిబ్బంది కోసం మొబైల్ టాయిలెట్లను ప్రారంభించిందని తెలిపారు.

ఈ వాహనం మహిళా పోలీసులకు డ్యూటీ సమయంలో ఉపయోగ పడతాయని, ముఖ్యంగా బహిరంగ సమావేశాలు, ర్యాలీలలో బందోబస్తు డ్యూటీలో ఉన్నప్పుడు ఇవి ఎంతో అవసరపడతాయని ఆయన అన్నారు. పోలీసు శాఖ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో, చిన్న, పెద్ద, బహిరంగ సమావేశాలు, పండుగ బందోబస్తులు, ప్రతి ఊరేగింపు సమయంలో మహిళా పోలీసు అధికారులను విధుల్లో నియమిస్తారు. వారి సౌలభ్యం గురించి రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ టాయిలెట్ ను ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, DSP డి.ఉపేంద్ర రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్,  సి.ఐ.లు, జీవన్ రెడ్డి, జాన్ దివాకర్, RI వెంకటి, ఉమెన్ ఎస్.ఐ.లు శ్రీలత, అంజమ్మ, యం.టి.ఓ వినోద్, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో రోడ్డుపై ధర్నా చేసిన అధికార పార్టీ కౌన్సిలర్

Satyam NEWS

ఓవర్ డోస్: పిల్లల ఆసుపత్రి వద్ద తల్లిదండ్రుల ఆందోళన

Satyam NEWS

గిద్దలూరును టిడిపికి కంచుకోటగా మార్చాలి….

Bhavani

Leave a Comment