31.7 C
Hyderabad
May 2, 2024 10: 32 AM
Slider ముఖ్యంశాలు

ఇంటి వద్ద ఐఐటీ, నీట్ శిక్షణ, అధ్యాపకుల సమాచారం

#IIT JEE Fourm

విద్యార్ధులకు బోధకులకు మధ్య వారధిగా ఉండటం ద్వారా కొత్త పంథా అనుసరించేందుకు ఐఐటి జెఈఈ ఫోరం నిర్ణయించింది. ఇది ఎంతో శ్రమతో కూడిన కార్యక్రమం అయినా కూడా ఫోరం సామాజిక దృక్పథంతో చేపట్టిదని ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇటు టీచర్లు, అటు విద్యార్ధులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన టీచర్లు దొరక్క విద్యార్ధులు ఇబ్బంది పడుతుంటే కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధికి దూరమైన టీచర్లు ఎందరో ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఇష్టంగా స్వీకరించిన వీరు లాక్ డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

వీరిద్దరిని నిస్వార్ధంగా కలిపే ప్రయత్నమే ఇది అని లలిత్ కుమార్ తెలిపారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఐఐటీ, నీట్ శిక్షకులకు ఆసరా “HomeIn” క్లాస్సేస్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఫోరం కన్వీనర్ కె. లలిత్ కుమార్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐఐటీ, నీట్ విద్యార్థులకు, వారి నివాసప్రాంతం సమీపంలో లోని “శిక్షకుల ” సమాచారాన్ని  విద్యార్థులకు అందించనున్నట్లు తెలిపారు. ఈ రెండు నెలల కాలం లో నేరుగా శిక్షకుల ఇంటి వద్దే శిక్షణ పొందవచ్చన్నారు.  శిక్షకుల వివరాలు కావలిసిన వారు ‘Master’ అని టైప్ చేసి  98490 16661 కు వాట్సాప్ /టెలిగ్రామ్ మెసేజ్ చెయ్యొచ్చన్నారు.

Related posts

చేనేత రంగ విద్యుత్ సమస్యలు తీర్చాలని మంత్రికి వినతి పత్రం

Satyam NEWS

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం..

Satyam NEWS

భారత ఇస్రో టీంకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు

Bhavani

Leave a Comment