ఎమ్మెల్యేగా వచ్చిన కొత్తలో మాన్సాస్ కు కొత్తగా చైర్మన్ ను నియమించిన ఘనత ఆయనదే…
అలనాటి బకాసురుడు నేడు ,ప్రస్తుతం భూ బకాసురుడిగా అవతరించారని…స్థానిక ఎమ్మెల్యే నుద్దేశించి…డీసీసీబీ మాజీ చైర్మన్ కాళ్ల గౌరీశంకర్ తీవ్ర విమర్శలు చేసారు. ఈ మేరకు విజయనగరం నాగవంశం వీధిలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఆయన అనుచరలు సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవలే జరిగిన ఇక్కడే నేను స్వయంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పై సవాల్ విసిరానని నేరుగా ఆయన నుంచీ సమాదానం రాకపోగా..ఆయన అనుచర గణం నుంచీ ఏవో పోంతన లేని సమాధానాలు వచ్చాయని కాళ్ల గౌరీశంకర్ గుర్తు చేసారు.
నేను స్వయంగా మీడియా సాక్షిగా అడుతున్న…నాతో బహిరంగ చరర్చకు వస్తారా…?వచ్చే ధైర్యం ఉందా…? అని కాళ్ల గౌరీశంకర్ ప్రశ్నించారు.నాడు ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో బకాసురుడు ..ప్రస్తుతం గుర్తుకు వస్తున్నారని అదీ…నగరంలో భూ బకాసురుడిని చూస్తేంటే అని కాళ్ల ఎద్దేవా చేసారు.ఇక ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో మాన్సాస్ కు కొత్తగా చైర్మన్ ను తీసుకొచ్చి…వేలాది మాన్సాస్ భూములను తన ఖాతాలోకి మార్చుకున్నారని కాళ్ల గౌరీశంకర్ తీవ్ర ఆరోపణలు చేసారు.