38.2 C
Hyderabad
May 2, 2024 21: 44 PM
Slider విజయనగరం

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరించే ఆలోచన విరమించుకోవాలి

#VizagSteel

కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటికరించే ఆలోచనను విరమించుకోవాలని  విజ‌య‌న‌గ‌రం యూటీఎఫ్ రాష్ట్ర  అధ్యక్షులు కె.ఎస్ ఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 

జిల్లా యూటీఎఫ్ 46వ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా ఆయ‌న పాల్గొని జిల్లా అధ్యక్షులు జె ఆర్ సి పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశాలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరించే ఆలోచనలో భాగంగా నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చిందన్నారు.

విద్యా రంగంతో పాటు, దేశీయ పరిశ్రమలను ప్రైవేటికరణ చేయాలనే నిర్ణయంలో భాగంగా ఇటువంటి నిర్ణయాలను ప్రభుత్వం చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రులు హక్కు అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి చేతులు దులుపుకోవలని చేస్తుందన్నారు.

32 మంది ప్రాణాలు కోల్పోయి వీరోచిత పోరాటాలు ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయాలని చూడటం అన్యాయమన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

స‌మావేశంలొ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఏవి అమలు చేయలేదన్నారు. పీ ఆర్ సీ అమలు,డీ ఏ, సీపీఎస్ రద్దు వంటి హామీలు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా చేయలేదన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించి ఈ సమావేశాల్లో పలు నిర్ణయాలు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నామన్నారు. ఈ సమావేశాల్లో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము,జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఉపాధ్యాయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ తొలగింపు

Sub Editor

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు బాధ్యతతో వ్యవహరించాలి

Satyam NEWS

సీజనల్ వ్యాధుల నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు

Satyam NEWS

Leave a Comment