40.2 C
Hyderabad
May 6, 2024 17: 17 PM
Slider పశ్చిమగోదావరి

జీవకోటి ప్రాణాలు తోడేస్తున్న ప్లాస్టిక్ సంచులు

#banplastic

ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవజాతి, పశు, మత్స్య, పక్ష్యాదులతో సహా జీవకోటి కి  భయంకరమైన కేన్సర్ వంటి వ్యాధులు సోకి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పెదవేగి ఎం పి డి ఓ గంజి రాజ్ మనోజ్ తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల వచ్చే వ్యాధుల పై శుక్రవారం అవగాహనా సదస్సు నిర్వహించారు.

ప్రతి రోజు మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు, కిరాణా షాపులకు వెళ్ళినప్పుడు ఆయా షాపుల యజమానులు మనం కొనుగోలు చేసిన వస్తువులను పాలిథిన్ కవర్లలోను, ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసి ఇస్తారని చెప్పారు. షాపింగ్ లకెళ్లేటప్పుడు మనం కాటన్ బాగ్ లు జూట్ బాగ్ లు తీసుకెళ్లి వస్తువులను వాటిలో తెచ్చుకోవాలని ఎం పి డి ఓ  సూచించారు. ఇప్పటికి చాలా మంది మార్కెట్ కెళ్ళి పాలిథిన్ కవర్లలో సరకులు తెచ్చి ఆ కవర్ లను ప్రక్కనే ఉన్న డ్రైనేజి కాలువ ల్లోకి విసిరేస్తామని అన్నారు.

అలా చేయడం వల్ల ఆ నీరు త్రాగే సమయం లో పశువులు నీటి మాటున ఉన్న పాలిథిన్ కవర్లు కూడా నీటితో పాటు పశువుల కడుపులోకెళ్లడం వల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా పాడై ప్రాణాలు కోల్పోతాయని చెప్పారు. కాలువలోకి విసిరిన పాలిథిన్ కవర్లు నీటి ప్రవాహం ద్వారా చెరువుల్లోకి, అక్కడ నుంచి సముద్రం లో కలవడం వల్ల వాటిని చేపలు ఆహారమనుకుని తిని చనిపోతున్నాయని విద్యార్థులకు వివరించారు.

విద్యావంతులైన మానవులు కూడా టీ స్టాల్స్ దగ్గర, హోటళ్ల వద్ద ప్లాస్టిక్ కప్పులలో టీలు కాపీలు త్రాగడం వల్ల ప్లాస్టిక్ టీ వేడికి కరిగి టీలో మన కళ్ళకు కనబడకుండా కలిసిపోయి గుండె ఊపిరి తిత్తులు, కిడ్నీ వంటి శరీర భాగాలకు కేన్సర్ వ్యాధులు సోకుతున్నాయని విద్యార్థులకు గుర్తు చేశారు.

విద్యార్థులు ఇప్పటి నుండైనా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని బహిష్కరించాలని ఆ దిశగా విద్యార్థులు తమ తమ కుటుంబాలకు వివరించి ప్లాస్టిక్ వస్తువుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై కుటుంబ సభ్యులకు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత నేటి విద్యార్థులపై ఉందన్నారు. ప్లాస్టిక్  రహిత సమాజం నిర్మించి జీవకోటి ప్రాణాలను ప్లాస్టిక్ భూతం మింగకుండా కాపాడ వలసిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి పై ఉందని ఎం పి డి ఓ రాజ్ మనోజ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు పెదవేగి పంచాయతీ కార్యదర్శి కె వరప్రసాద్, మహిళా పోలీస్ జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

కందుకూరు తొక్కిసలాట మృతులకు ప్రధాని సంతాపం

Bhavani

జర్నలిస్టులపై దాడులు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు

Bhavani

వేసవి క్రీడా శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

Leave a Comment