38.2 C
Hyderabad
April 29, 2024 12: 41 PM
Slider మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కల్వకుర్తి రోడ్లు

#kalwakurtyroads

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ పరిధిలో రోజుకో ప్రమాదం చొప్పున ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై సంఘటనా స్థలంలోనే చనిపోతున్నారు. దాదాపు 15 రోజుల నుండి పట్టణ పరిధిలో ఎక్కడో ఒకచోట ప్రమాదాలకు గురై సంఘటనా స్థలంలోనే తుది శ్వాస విడిచి  కుటుంబ సభ్యులను అనాధగా చేసిన సంఘటనలతో కల్వకుర్తి పరిధిలో కాటికి వెళ్లే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైతున్నారు.

బాధ్యతరహితంగాను, అధికారుల నిర్లక్ష్యంతోను, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోను, విచ్చలవిడిగా వాహనాలను నడుపడమే కారణాలుగా కనిపిస్తున్నాయి. నడిరోడ్ల పై వాహనాలు నిలపడం, కాలం చెల్లిన, నెంబర్ ప్లేట్ లేని, ప్యాసింజర్ ఆటోలో పరిమితికి మించి జనాలని ఎక్కించడమే గాక నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణాలు, పెద్ద పెద్ద చీకులు పైపులలతో, రోడ్లపైకి వస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఉదయం 6 గంటల లోపు దిగుమతులు ఎగుమతులు చేసుకోవాలని పోలీస్ వారు వ్యాపారస్తులను హమాలి వారిని సమావేశపరిచి చెప్పినా వారి సూచనలను త్రుంగలో తొక్కినా పట్టించుకునే నాధుడే కరువయ్యారని ట్రాఫిక్ జామ్ లతో ఎటు వెళ్లాలో తోచని స్థితిలో పరిస్థితులు గోచరిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు రెండు రోజులు హడావిడి చేసేదే తప్ప ఒరిగేదేమీ లేదంటూ పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు.

వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వారి వారి సామానులను రోడ్లపైకి పెట్టడమే గాక పది పన్నెండు ఫీట్లు రోడ్లను రేకులు వేసి ఆక్రమించిన, నడిరోడ్లపై కూరగాయల వ్యాపారస్తులు వ్యాపారం చేసుకున్న వారిని ప్రశ్నించిన, ముందుకు వచ్చిన, పట్టణం బాగుండాలి బాగుపడాలి అనే ఉద్దేశంతో ఉన్న నాయకులపై మిగతా నాయకులు చిల్లర రాజకీయాలతో వారిని దూషిస్తూ కించపరచడమే కాకుండా వారిని చులకన భావంతో వెక్కిరిస్తున్నారని స్థానికులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు, ఆర్టీవో  అధికారులు, మున్సిపల్ అధికారులు నాయకులు కలిసి ఒక తాటిపై వచ్చి కల్వకుర్తి పరిధిలో కాటికి వెళ్లే వాళ్లని వెళ్లకుండా వారి సంఖ్య అదుపులో ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది.

పోల శ్రీధర్, సత్యం న్యూస్, కల్వకుర్తి

Related posts

ఆంక్షలు కఠినం.. అవసరమైతే లోకల్ లాక్ డౌన్

Satyam NEWS

సంక్రాంతి సంబరాలు

Satyam NEWS

తెలంగాణ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment