37.2 C
Hyderabad
May 2, 2024 13: 39 PM
Slider నల్గొండ

లాక్ డౌన్ లో పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యత

#Nalgodna Addl SP Narmada

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను ఆదుకోవడం ఒక సామాజిక బాధ్యత అని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణ శివారులోని రాంనగర్ ఎస్.సి. కాలనీలోని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ నర్మద మాట్లాడుతూ నిజమైన అర్హులకు అందిస్తున్నందుకు మనసుకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని ఆమె చెప్పారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపివేస్తోందని ఇలాంటి విపత్కర పరిస్థితులలో తోటివారి పట్ల ప్రతి ఒక్కరూ మానవత్వం ప్రదర్శించాలన్నారు. సుమారు 90 కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసరాలు అందించినట్లు ఆమె తెలిపారు.

లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా తమ వంతు కృషి చేస్తున్నామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, సబితా రాణి, దయాకర్ పాల్గొన్నారు.

ఇంకా డిపిఓ సిబ్బంది ఖలీల్, కార్తిక్, ఎం.డి.గౌస్, రాజు, సయ్యద్ షాకీర్, మమత, స్పందన, స్వప్న, గౌడ మోహియుద్దీన్, భారతి, మహబూబ్ అలీ, ప్రమోద, ఆకుల శ్రీను, ఖుర్షిద్, వెంకన్న, అమిన్, వన్ టౌన్, టూ టౌన్ ఎస్.ఐ.లు నరేష్, నర్సింహులు తదితరులు పాల్గొని పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Related posts

రైతులకు నష్టపరిహారం చెల్లించాలి: బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి

Satyam NEWS

లూజ్ టంగ్: ఇతనా ప్రజాప్రతినిధి? ఇదేం సంస్కృతి?

Satyam NEWS

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు కోవిడ్ బ్రేక్

Satyam NEWS

Leave a Comment