32.2 C
Hyderabad
May 8, 2024 22: 13 PM
Slider నిజామాబాద్

గ్రామస్థులకు కరోనా వైరస్ పై అవగాహనాకార్యక్రమం

#Corona Awarenes

కరోనా పాజిటీవ్ వచ్చిన వ్యక్తిని పరామర్శించేందుకు నేడు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామాన్ని వైద్యాధికారులు సందర్శించారు. అక్కడ ఆ వ్యక్తి జ్వరం, జలుబు దగ్గు శ్వాస సంబంధ సమస్యలు, ఛాతి నొప్పితో ఇబ్బంది పడుతున్నాడా అని విచారించారు. 17 రోజుల పాటు హోమ్ ఐసోలాషన్ లో ఉండాలని తెలిపి ఆ వ్యక్తికి కావాల్సిన మాత్రలు ఇచ్చారు.

అలాగే హోమ్ ఐసోలాషన్ నందు ఖచ్చిత మైన నియమ నిబంధనలను పాటించాలని వారు సూచించారు. ఇంటి నుండి బయటకు రాకూడదు. తప్పని సరిగా మాస్క్ ధరించాలి.  తరచు చేతులను శుభ్రంగా కడుక్కొవాలి. సామాజిక దూరం పాటించాలి. అలాగే వ్యక్తి గత పరిశుభ్రత పాటిచాలి అని చెప్పారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడుతూ రాజధాని హైదరాబాద్ కు గానీ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలకు గానీ అలాగే పక్క జిల్లాలకు, దూర ప్రాంతాలకు ప్రయాణించవద్దని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వాజిద్ నగర్ గ్రామ సర్పంచ్ అనుయ లక్ష్మీ నారాయణ, ఉప సర్పంచ్ సాయిలు , MPTC బండికింది సాయులు, డాక్టర్ మమత, ఆరోగ్య బోధకుడు దస్థిరాం, బహుళ ఆరోగ్య విస్తరణ అధికారి ఇంతియాజ్ అలీ, ఆరోగ్య కార్యకర్త అంగన్వాడీ టీచర్ ఆశా  గ్రామ  ప్రజలు  పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం మెరుగైంది దాన్ని కాపాడుకోవాలి

Satyam NEWS

అమ్మను శరణు వేడుదాం

Satyam NEWS

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment