28.7 C
Hyderabad
May 6, 2024 07: 51 AM
Slider కవి ప్రపంచం

నిన్ను తలంచి…

#P V Narasimharao

అక్షరము అంజలిగా రూపుదిద్దిన వేళ …

అగుపించినదో స్ఫురద్రూపం

అది నిండుగ నిండిన తెలుగుతేజం

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం

దేశ విదేశాలలో  వెలిగిన కిరణం

దక్షిణాదిన మెరిసిన ధృవనక్షత్రం

భాషలతో మమేకమైన సాహితీసౌరభం

సహస్రఫణిగా అవతరించిన అద్భుతం

పదవులకు తలమానికమైన మంత్రిత్వం

తెలుగువారి ఖ్యాతిని నిలిపిన తొలి శిఖరం

అసమాన కార్యదీక్షకు ఆలవాలం

రక్షణకు ప్రణాళికకు కట్టిన పట్టం

బూరుగుతో పరిమళించిన స్నేహం

కాంగ్రెస్ కు కట్టుబడిన హస్తం

మానవతకు మార్గదర్శనమైన మారురూపం

మనవాడనిపించుకున్న ఆత్మీయబంధం

ఎన్ని మాటలపోగు కుప్పపోసినా

ఎంతగా ఇన్ సైడర్ లో తొంగిచూసినా

అంతుతేలని అనంత మహోన్నత వ్యక్తిత్వం

భావితరం భవితకు పరచిన ఎక్స్ ప్రెస్ వే..

డా.సమ్మెట విజయ, సికింద్రాబాద్, 9989820215

Related posts

బాటసారి ఫౌండేషన్ ఆధ్యర్యంలో పుస్త‌కాలు

Sub Editor

రాష్ట్రంలో అధికరణ 356 ద్వారా రాష్ట్రపతి పాలన పెట్టాలి

Bhavani

కైండ్ నెస్: బైంస బాధితులకు సేవా సమితి వితరణ

Satyam NEWS

Leave a Comment