30.7 C
Hyderabad
April 29, 2024 05: 16 AM
Slider కవి ప్రపంచం

అమ్మను శరణు వేడుదాం

#Vedaardham Madhusudhana Sharma

వేసవి భానుని ప్రతాపం

తర్వాత వచ్చిన వర్షాలతో

ఒక్కసారిగా మారిన వాతావరణం.

రకరకాల వ్యాధులన్నీ

చుట్టుముట్టే కాలం.

ఇలాంటి వ్యాధులు మనలను

దరిచేరనీయకు అమ్మా!

అని ప్రతి సంవత్సరం

ఆషాఢమాసములో ఘనంగా

జరుపుకుంటాము బోనాల పండుగ.

కాకతీయుల కాలం నుండి

ఆరంభమైన ఈ ఉత్సవం.

గోలకొండ రాజుల కాలములో

మరింత ఘనత సాధించింది.

పసుపుకుంకుమలతో అలంకరించిన బోనాన్ని

ముస్తాబైన ఆడపడుచులు నెత్తిన పెట్టుకొని కదులుచుండ

డప్పులు దరువుల శబ్దాలకు

శివసత్తులు,పోతరాజు

సిగమూగుచు నాట్యమాడ

భక్తితో సమర్పిస్తాము

అమ్మవారికి మొక్కులు.

ప్రస్తుత విపత్తు నుండి మనల కాపాడమని

శరణు వేడుదాము.

వేదార్థం మధుసూదన శర్మ,9063887585.

Related posts

పరిమితికి మించిన అప్పులు: ఏపికి ఇక తిప్పలు

Satyam NEWS

పుణ్యభూమి

Satyam NEWS

ప్రభుత్వ ఉదాసీనతే కారణం

Murali Krishna

Leave a Comment