33.2 C
Hyderabad
May 14, 2024 13: 51 PM
Slider నిజామాబాద్

బిచ్కుంద చెరువులో తొంభై ఏడు వేల చేప పిల్లల విడుదల

#bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద గల కుమ్మరి చెరువులో తొంభై ఏడు వేల చేప పిల్లలను జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే స్థానిక నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్య కారుల కుటుంబాలకు తెరాస ప్రభుత్వం ఎంతగానో ఆదుకుంటుందన్నారు. అందులో భాగంగానే టీవీఎస్ మోపెడ్ వాహనం ట్రాలీ బండ్లు, చాపల సరఫరాకు పెద్ద టాటాఏసి వాహనాలు కూడా రాయితీపై ఇచ్చిందన్నారు.

అందరికంటే ఎక్కువగా మత్స్య కారులకే ప్రభుత్వం ఎంతగానో ఉపాధి కల్పిస్తుందన్నారు. చేప పిల్లల ఉత్పత్తి కాగానే ప్రతి ఒక్కరూ మత్స్యకారుడు చేపలను పట్టుకుని జీవన ఉపాధి కొనసాగించాలన్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు ఆదుకుంటుదన్నారు. రైతులకు రైతుబంధు రైతుబీమా, ఆడపడుచులు పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి ,గర్భిణులు మహిళలకు ఆరోగ్య లక్ష్మి కేసీఆర్ కిట్టు లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.

ప్రతి ఒక్కరూ కెసిఆర్ నాయకత్వాన్ని పటిష్ఠపర్చాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు స్థానిక సర్పంచ్ శ్రీరేఖ, ఎంపీపి అశోక్ పటేల్, సహకార సంఘం అధ్యక్షులు (బాలు )బాలాజీ ,మార్కెట్ కమిటీ అధ్యక్షులు మల్లిఖార్జున్, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయ్. రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజు పటేల్ , మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజు ,మాజీ ఎంపిటిసి సాయిరామ్, ఎంపీడీవో ఆనంద్,జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు ,నిజాంసాగర్ మత్స్యశాఖ అధికారి డోలుసింగ్,సిబ్బంది జయరామ్, సురేష్గౌడ్ ,ఎల్లేష్, దశరథ్   స్థానిక ప్రజాప్రతినిధులు మత్స్య కార కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

రాజంపేట అసెంబ్లీ పరిధిలో ఆరు ఎంపీపీ లు వైసీపీ ఏకగ్రీవం…

Satyam NEWS

రిపబ్లిక్ టివి అర్నబ్ గోస్వామి బెయిల్ తిరస్కరణ

Satyam NEWS

ఎన్నికల సమయంలో వాలంటీర్ లను విధులనుండి తప్పించాలి

Bhavani

Leave a Comment