28.7 C
Hyderabad
April 28, 2024 05: 20 AM
Slider రంగారెడ్డి

కాప్రా సర్కిల్లో ఇష్టారాజ్యంగా  రోడ్డు కటింగ్ లు

#kapramunicipality

నిమ్మకు నీరెత్తినట్లు అధికారుల చేతివాటం తో ప్రభుత్వ ఆదాయానికి గండి

కాప్రా సర్కిల్ పరిధిలోని మహేష్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలో  నిబంధనలకు విరుద్ధంగా సిసి రోడ్డు కటింగ్లు చేపట్టారు. దీంతో అటువైపుగా వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వాహనం సహాయంతో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతి లేకుండా  రోడ్డు కటింగ్ చేస్తారని వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో కింది స్థాయి ఉద్యోగుల చేతివాటం తో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.  నిత్యం కాలనిలో రోడ్డు కటింగ్ చేపడుతున్నా కానీ ఒక అధికారులు పర్యవేక్షణ లోపాయికారంగా మారింది.

దీంతో ప్రజాధనం వృదా అవుతుందని కాలని అసోసియేషన్ సభ్యులు అధికారుల తీరుపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని కాలని వాసులు స్థానికులు వాపోయారు. గతంలో సంతోష దాబా సమీపంలో చేపడుతున్న రోడ్డు కటింగ్ ను కమిటి సభ్యులు అడ్డుకొని సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన,అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని అధికారుల తీరుపై కాలనీవాసులు మండిపడుతున్నారు.   

కిందిస్థాయి అధికార సిబ్బందికి ముడుపులు ముట్ట చెప్పడంతో అధికారులు  అటు వైపు కన్నెత్తి చూడడం లేదని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహేష్ నగర్ కాలనీవెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక వీధి నిర్వహణలో  నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Related posts

ఏపీ లో 16 మంది ఐపీఎస్ ల బదిలీలు

Satyam NEWS

అన్ని వ‌ర్గాల మేలే బీజేపీ ల‌క్ష్యం

Sub Editor

రష్యా వద్ద ఆయుధాలు అయిపోతున్నాయోచ్

Satyam NEWS

Leave a Comment