29.7 C
Hyderabad
May 3, 2024 04: 42 AM
Slider విజయనగరం

భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో ప్రజలను గందరగోళం లోకి నెట్టొద్దు…!

విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్టు భూముల విషయంలో ప్రజల ను గందరగోళం లోకి నెట్టేయవద్దని కేంద్ర మాజీ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా మావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ.. దాదాపు రెండు వేల ఎకరాల లో ఎయిర్ పోర్టు ను నిర్మించాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి 600 ఎకరాల తగ్గించడం సబబేనా అని ప్రశ్నించారు. నష్ట పరిహారం విషయంలో రైతులకు ఇచ్చే అంశంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే గుంటుందన్నారు.

ఇక అప్పట్లో జీఎంఆర్ కు అప్ప చెప్పడంపై…కూడా ఈ వైఎస్సార్సీపీ ఇబ్బందులు పెట్టి నట్టు గుర్తు అని అన్నారు. ఆ సమయంలో విశాఖ ఏర్ పోర్టు లో కోడి కత్తి అంశంపై కూడా జరిగన అంశం తెలుగు ప్రజలెవ్వరూ మర్చిపోరని అశోక్ ళగజపతి రాజు అన్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ చేత ఆదరాబాదరగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించి…ఆ క్రెడిట్ కొట్టేద్దామని ఆ పార్టీ యత్నం గా తాను భావిస్తున్నానన్పారు…కేంద్ర మాజీ పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు. ఈ విలేకరుల సమావేశంలో ఐవీపీ రాజు..ఇతర నేతలు ఉన్నారు.

Related posts

ఆడిట్ రిపోర్ట్: చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు

Satyam NEWS

మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్లు

Satyam NEWS

పెబ్బేరు బిఆర్ఎస్ నేతపై కేసు:ఎస్పీ రక్షిత కె మూర్తి

Satyam NEWS

Leave a Comment