29.7 C
Hyderabad
April 29, 2024 08: 39 AM
Slider మహబూబ్ నగర్

పెబ్బేరు బిఆర్ఎస్ నేతపై కేసు:ఎస్పీ రక్షిత కె మూర్తి

#wanaparthypolice

వనపర్తి జిల్లా  పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామంలో 10వ తేదీన   పెబ్బేరు మండలం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు ఎన్నికల నియమాలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి తెలిపారు. పాతపల్లి గ్రామంలోని చింతల హనుమాన్ దేవాలయం దగ్గర ఎక్కువ మందితో దాదాపు 2000 మందితో  పండగ నిర్వహించి భోజనాలు ఏర్పాటు చేయడం, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి    మీటింగ్ కు హాజరై చివరి పది నిమిషాలు  ప్రసంగించారన్నారు.

ఈ సందర్భంగా పాతపల్లి, నాగసాన్పల్లి, ఇతర గ్రామస్తులు సుమారు 2,000 మంది హాజరయ్యారు. ఎన్నికల నియమావళి అతిక్రమించి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు పెబ్బేర్  బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడుపై కేసు నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు 13 న ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 1 ఇంఛార్జి బి. పి. ప్రసాద్ ఫిర్యాదు చేయగా పెబ్బెర్ పోలీస్ స్టేషన్ లో రాములుపై కేసు  నమోదు అయిందని తెలిపారు. పెబ్బేరు  బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించినందుకు అతనిపై  171-బి. రెడ్ విత్ ,171-ఇ, ఐపిసి 26 ఆఫ్ తెలంగాణ డిస్టిక్ పోలీస్ యాక్ట్ అండ్ సెక్షన్ 3 రెడ్ విత్ 7 ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ మిస్ యూస్ యాక్ట్) 1988  సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

కరోనా వ్యాక్సిన్ వికటించడంతో డాక్టర్ కు తీవ్ర అస్వస్థత

Satyam NEWS

ఫాలో మీ: చికెన్ తిన్న మునిసిపల్ మంత్రి కేటీఆర్

Satyam NEWS

ఆకలే అసలు వైరస్

Satyam NEWS

Leave a Comment