36.2 C
Hyderabad
May 7, 2024 11: 17 AM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ ధర్నాకు అనుమతించిన న్యాయస్థానం

#Mallu Ravi

ఈ రోజు ఇందిరాపార్క్ వద్ద టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ ఆధ్వర్యంలో జరిగే సర్పంచ్ ధర్నా కు కోర్ట్ అనుమతి ఇచ్చిందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తెలిపారు. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నామని ఆయన తెలిపారు. పోలీసుల అనుమతి తీసుకున్న కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధాలు చేస్తూన్నారని ఆయన ఆరోపించారు.

తమకు అన్ని ప్రాంతాల నుంచి నాయకుల ద్వారా సమాచారం తెలుస్తుంది. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవద్దు. కాంగ్రెస్ నాయకులను అరెస్టులు, గృహ నిర్బందాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన అన్నారు. అనుమతి ఉండి, శాంతి యుతంగా నిర్వహించే ధర్నాను అడ్డుకుంటే కోర్ట్ ధిక్కరణ కిందకు వస్తుందని ఆయన హెచ్చరించారు. గృహ నిర్బంధం చేసిన నాయకులకు వెంటనే పోకిసులు స్వేచ్ఛ ఇవ్వాలి.

వారిని ధర్నాలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలి..లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది అని మల్లు రవి హెచ్చరించారు.

Related posts

ఇంటింటికీ జాతీయ జెండా కార్య‌క్ర‌మం ప్రారంభం…!

Satyam NEWS

భజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గణనాథుని కి ఘనంగా పూజలు

Satyam NEWS

జగన్ గుండెల్లో రాయి: టీడీపీ జనసేన పొత్తు ఖాయం

Satyam NEWS

Leave a Comment