28.7 C
Hyderabad
May 6, 2024 10: 17 AM
Slider పశ్చిమగోదావరి

ఏలూరు మండలంలో భారీ ఎత్తున కరువు పనులు

#saralakumari

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం లో 7కోట్ల 60లక్షల 65వేల రూపాయల నిధుల తో కరువు పనులు నిర్వహిస్తున్నట్టు ఇంచార్జి ఎం పి డి ఓ  సరళ  కుమారి తెలిపారు.

2021 .2022 సంవత్సరానికి గాను చేపట్టిన కరువు పనులలో 7.676 కుటుంబాలకు పని కల్పించగా 12 వేల 269 మందికి గాను 3లక్షల 38 వేల 593 పనిదినాలు కరువు పనులు కల్పించనున్నామని సరళకుమారి మంగళవారం సత్యం న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వూ లో తెలిపారు.

ప్రతి కుటుంబానికి ఇప్పటికే 44 పనిదినాలు  కల్పించామని ఏలూరు మండల ఎన్ ఆర్ ఈ జి ఎస్   ఏ పి ఓ కిషోర్ కుమార్ తెలిపారు.

ప్రతి కూలీ కి రోజుకు కనీస వేతనం గా 227 రూపాయలు పొందుతున్నారని ఏ పి ఓ అన్నారు. మండలం లో 334 కుటుంబాలకు 100రోజులు పని కల్పించినట్టు తెలిపారు.

కోవిడ్ ఉధృతి కారణంగా ప్రత్తికొల్ల లంక, గుడివాక లంక గ్రామాలలో సర్పంచ్ లు కూలీలను కరువు పనులకు  వెళ్లనీయకుండా  లాక్ డౌన్ ప్రకటించారని చెప్పారు.

Related posts

సంబంధిత పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకోవాలి

Satyam NEWS

ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి

Satyam NEWS

రజక సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎంపిపి గూడెపు శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment