33.7 C
Hyderabad
April 29, 2024 02: 24 AM
Slider ముఖ్యంశాలు

ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడి

#shabbirali

15 రోజుల్లో పెండింగులో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని మాజీ మంత్రి షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో విద్యార్థుల ఫీజు రియంబర్ మెంట్ మరియు స్కాలర్ షిప్స్ విడుదలకై వివిధ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి మాజీ మంత్రి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అద్వర్యంలో 5000 మంది విద్యార్థులతో భారీర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు ఉన్నత విద్య అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫీజు రియంబర్ మెంట్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చి పేద విద్యార్థుల ప్రాణాలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు.

గత మూడు సంవత్సరాలుగా దాదాపు 3300 కోట్ల నిధులు విడుదల చేయక పోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంటర్ డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కళాశాలల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే గద్దె దింపుతారని జ్యోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ మీద ఆధారపడి చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈబిసి, మైనారిటీ విద్యార్థులను విద్యకు దూరం చేసే దురుద్దేశంతో సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు.

ఫీజు బకాయిలు చెల్లించక పోవడంతో వివిధ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ కు ఉప ఎన్నికల మీదున్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని విమర్శించారు. ఎక్కడో హర్యానా బీహార్ రాష్ట్రాల్లో ఉన్న రైతుల బాధలు కనిపిస్తున్న ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల బాధలు ఎందుకు కనిపించట్లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్లలో పరిస్థితి దారుణంగా ఉందని, సరైన వసతులు లేక, మెస్ చార్జీలు పెంచక, పౌష్టికాహారం అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హాస్టల్లో పురుగుల అన్నం తిని వందలాది విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంక్షేమ హాస్టళ్లు నరక కూపాలుగా మారాయన్నారు. బాసర త్రిబుల్ ఐటీలో నిన్నకు నిన్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తుచేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్ మెంట్స్, స్కాలర్ షిప్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేదంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చించి ప్రతి జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు షబ్బీర్ అలీ భరోసా

కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అడ్లూర్, ఇల్చిపూర్ గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ లో భూములు కోల్పోతున్న నిర్వాసితులు మాజీ మంత్రి మాజీ షబ్బీర్ అలీని కలిసి వినతి పత్రం అందించారు. వెంటనే స్పందించిన షబ్బీర్ అలీ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఐఎఎస్ తో మాట్లాడి కామారెడ్డి మున్సిపల్ నూతన మాస్టర్ ప్లాన్ అమలు కాకుండా చూడాలని కోరారు.

అరవింద్ కుమార్ స్పందిస్తూ దరఖాస్తు పంపిస్తే తప్పకుండా ఆపేస్తామని, మళ్ళీ సర్వే చేయించి అందరికీ ఆమోదయోగ్యమైన ప్లాన్ ను రూపొందిస్తామని తెలిపారు. దాంతో వెంటనే షబ్బీర్ అలీ తన పర్సనల్ సెక్రటరీ ద్వారా అరవింద్ కుమార్ కు వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల భూములు పోకుండా తాను ముందుండి పోరాటం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.

ప్రజలను మభ్యపెట్టి ప్రజల సెంటిమెంటును ఆసరాగా తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే వారి వెంట తిరిగి రైతులు తమ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని వారికి అండగా ఉంటనని భరోసా ఇచ్చారు.

షబ్బీర్ ఆలీకి వినతిపత్రం అందిస్తున్న రైతులు

Related posts

కడప జిల్లా జడ్పీ చైర్మన్ గా అకేపాటి ప్రమాణ స్వీకారం

Satyam NEWS

శ్రమ జీవన వేదం

Satyam NEWS

గుర్తింపు ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వాలనే….

Satyam NEWS

Leave a Comment