39.2 C
Hyderabad
May 3, 2024 14: 46 PM
Slider కర్నూలు

మహానంది పుణ్యక్షేత్రంలో నేటి నుంచి డ్రెస్‌కోడ్‌

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది. సాక్షాత్తూ పరమేశ్వరుడే స్వయంగా వెలసిన ఈ క్షేత్రంలోని స్వామి వారిని దర్శించుకోవాలంటే ఇక నుంచి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఆలయ గర్భ గుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ ను అమలు చేయాలని ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి అండ్ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి నిర్ణయించారు.స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించాలని తెలిపారు.అవును కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రంలో ఇవాళ్టి నుంచి డ్రెస్‌కోడ్‌ అమల్లోకి వచ్చింది.భక్తులంతా సంప్రదాయ దుస్తుల్లోనే పుణ్యస్నానాలు, దర్శనాలు చేసుకోవాలని నిర్ణయించారు ఆలయ ధర్మకర్తల మండలి. ఇకపై మహిళా భక్తులు చీర లేదా చున్నీ ఉన్న చుడీదార్‌ ధరించి దర్శనాలకు రావాలని, అలాగే పురుషులు పంచె లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి అండ్ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి. అంతేకాదు భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించే విధంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఛైర్మన్‌ అండ్ ఈవో. ఆలయ ధర్మకర్తల మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గౌరవించాలని కోరారు.

Related posts

పార్టీ మారేందుకు జూపల్లి మరో అడుగు ముందుకు?

Bhavani

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహద పడతాయి

Satyam NEWS

Analysis: యువత మనసు ఎరగని ‘మన్ కి బాత్’

Satyam NEWS

Leave a Comment