33.2 C
Hyderabad
May 4, 2024 01: 25 AM
Slider నల్గొండ

సాయం చేస్తూ అంకితభావంతో ముందుకు సాగుదాం

#dsrtrust

ఏసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు సందర్భంగా దగ్గుపాటి సుశీల రాజారత్నం (డి ఎస్ ఆర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో నేత్రదానం ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తిలక్ నగర్ కు చెందిన మామిడి  కిషోర్ ఎస్సై టాస్క్ ఫోర్స్ (ఎస్ ఓ టి) హైదరాబాద్,డి ఎస్ ఆర్  ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు దగ్గుపాటి సత్యానందం నేత్రదానం శ్రేష్టమైన దానమని,ఇద్దరు అంధులకు చూపును అందిస్తుందని అన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఎవరైనా మరణించిన 7 నుంచి 8 గంటల లోపు కుటుంబ సభ్యులు మానవత్వంతో నేత్రదానం చేయించాలంటే డి ఎస్ ఆర్. ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావుని సంప్రదించాలని,లేదా నెంబర్లకు 8309259384, 9010439879 ఫోన్ చేసి తెలియపర్చాలని కోరారు.

ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ నేత్రదానం కొరకు ఫోన్ చేసిన 2 గంటల లోపల ఖమ్మం నేత్ర నిధి బృందం రావడం జరుగుతుందని,కొద్ది క్షణాలపాటు ఈ లోకమంతా చీకటి కమ్మేస్తే ప్రాణం పోయినట్లు బాధపడతాం అంత చీకటిని భరించలేక అల్లాడిపోతామని,కళ్ళు నలుపుకుంటూ ఆ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తామని, అటువంటిది పుట్టుకతో లేదా ప్రమాద వశాత్తు కళ్ళు పొగొట్టుకున్న వాళ్లకు జీవితాంతం అన్ని క్షణాలు చీకటేనని, ఎంతగా ఎదిగినా ప్రపంచాన్ని చూడలేమన్న బాధే ఉంటుందని అన్నారు.అటువంటి వారికి చూపునిచ్చే అవకాశం మనకే వస్తే మనం చనిపోయిన తరువాత కూడా మన కళ్ళకు మరో జీవితం లభిస్తే అంతకన్నా ఆనందం మరొకటి వుండదని,నేత్రదానం చేస్తే ప్రతిఒక్కరూ ఈ ఆనందాన్ని పొందవచ్చునని,నేత్రదానం గొప్పదానమని, మనిషి మరణించాక కూడా తన కళ్ళతో లోకాన్ని చూడగల అద్భుతం నేత్రదానం ద్వారనే జరుగుతుందని అన్నారు.

సమాజంలో అందరిని చైతన్య పరిచి నేత్రదానం చేసేందుకు ఒప్పించాలని,ఒకరు నేత్రాలను దానం చేస్తే వారు ఇద్దరికి కంటిచూపు ఇచ్చిన వారవుతారని, కళ్లు లేని వారు లక్షల్లో ఉన్నారని, చనిపోయిన తర్వాత మట్టిలో కలపకుండా వేరే వారికి నేత్రదానం చేయవలసిందిగా కోరారు.ప్రతి ఒక్కరు మరణానంతరం కళ్ళు దానం చేసి ఆదర్శంగా నిలిచి మరొకరికి కంటిచూపు ఇవ్వాలని కోరారు.  సాయం చేస్తూ సహకరించుకుంటూ అనుక్షణం అంకితభావంతో ముందుకు సాగుదామని దగ్గుపాటి బాబురావు అన్నారు.

ఈ కార్యక్రమానికి డి ఎస్ ఆర్ ట్రస్ట్ సభ్యులు దగ్గుపాటి సుశీల,కామళ్ళ మార్క్స్,లచ్చిమల్ల నాగేశ్వరరావు, కోల్లపూడి కళ్యాణ్,మామిడి అశోక్, చింతమల్ల ప్రసాద్,మామిడి రాజేష్, దగ్గుపాటి సురేష్,దగ్గుపాటి రాజేష్, దగ్గుపాటి కవిత,కొల్లపూడి ప్రేమ్ చందు, మామిడి నవీన్,మామిడి రాజేష్,మామిడి ప్రశాంత్,పాశం నరసింహారావు, టైలర్. పొదిల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

శ్రీ‌వారి ఆల‌యం నుండి అమ్మవారికి సారె

Murali Krishna

మాదిగల పట్ల వివక్ష ప్రదర్శిస్తూ అవమానిస్తూన్నఎమ్మెల్యే జోగు రామన్న

Bhavani

రాహుల్ పై మరో కేసు

Murali Krishna

Leave a Comment