29.7 C
Hyderabad
April 29, 2024 09: 12 AM
Slider నిజామాబాద్

డోంగ్లీ లో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం    

#dryday

కామారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్వో బాన్సువాడ వారి ఆదేశాల మేరకు మద్నూర్ మండలంలోని డోంగ్లీ  గ్రామంలో బి సబ్ సెంటర్లలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివిజన్ ఆరోగ్య బోధకులు  దస్తీరామ్  మాట్లాడుతూ నేడు ఫ్రైడేను డ్రైడేగా నిర్వహించుకుంటున్న మని నీటిలోని లార్వా పొడగడనికి పట్టే సమయము వారము రోజులు, కాబట్టే వారము తిరగకంటే ముందే నిల్వ ఉంచిన నీటిని పారపోసేసి ఆ డ్రమ్ములను, బింద్యాలను, కుందిలను,కొబ్బరి చిప్పలను,పాత టైర్లను, కారము నూరుకొనే రోళ్లాను,చెడిపోయిన కులర్లు, దోమను అంతము చేయడానికి నిల్వ నీటిని తొలగించాలని చెప్పారు.

కాలనికి అనుగుంగా వచ్చే వాహక వ్యాధులు మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా  ,కాలఅజర్, JE లాంటి వ్యాదులను నివరించడమే ఫ్రీడే డ్రైడే ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. మూడు దోమలు ఐదు రోగాలు 1 అనాఫిలిస్ దోమవల్ల  మలేరియా వ్యాది 2 ఖ్యులేక్స్ దోమవల్ల  ఫైలేరియా వ్యాది,JE, 3  ఏడేస్ దోమవల్ల  డెంగ్యూ, చికెన్గున్యూ  వ్యాధులు వస్తాయి అని వివరించారు.

నీటిద్వారా కూడా నీళ్ల విరోచనాలు, కుట్టు బయలు,GE, కలరా, కామెర్లు లాంటి వ్యాధులు వస్థాయి అని వివరించారు. పరిశుభ్రమైన నీటినే వాడాలి ఆరోగ్యాన్ని పరిరక్షణ కొరకు మంచి గాలి, మంచి ఆహారం, మంచి వాతావరణం తీసుకుంటే అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య బోధకులతోపాటు ఆరోగ్య సిబ్బంది  స్వప్న, ఆశ కార్యకర్తలు ఈశ్వరి, కమల,రేఖ, మంజుల, అంగన్వాడీ కార్యకర్త  గె౦దాబాయి తో పాటు తదితరులు ఉన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్.నెట్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

సహాకరిస్తే కొద్ది కాలం బతుకుతాం, లేకుంటే అర్ధాంతరంగా పోతాం

Satyam NEWS

సెప్టెంబర్ 11 నుంచి స్టార్ మా లో మామగారు సీరియల్

Satyam NEWS

కుంటాల సోమ‌న్నహ‌రిత‌వ‌నం పార్కుకు మంత్రి అల్లోల శంఖుస్థాప‌న‌

Satyam NEWS

Leave a Comment