29.2 C
Hyderabad
May 9, 2024 23: 38 PM
Slider జాతీయం

భారీ వర్షాల కారణంగా తగ్గిపోయిన చార్ ధామ్ యాత్రీకులు

#chardhamyatra

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రీకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ ధామ్‌లను సందర్శించే యాత్రికుల సంఖ్య ప్రతిరోజూ వెయ్యికి తగ్గిపోయింది.

బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ డేటా ప్రకారం, యాత్ర ప్రారంభమైనప్పటి నుండి జూలై 16 వరకు 26.49 లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్‌లను సందర్శించారు. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ మీడియా ఇన్‌ఛార్జ్ డాక్టర్ హరీష్ గౌర్ మాట్లాడుతూ చార్ధామ్ యాత్ర ప్రారంభంలో, ఒక రోజులో 20 వేల మందికి పైగా యాత్రికులు బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ ధామ్‌లకు దర్శనం కోసం చేరుకున్నారని చెప్పారు.

అయితే వర్షాల కారణంగా బద్రీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను సందర్శించే యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వర్షంలో పర్వతాలపై నుంచి కొండచరియలు విరిగిపడటం, కొండపై నుంచి కొట్టుకు వచ్చే మట్టి ఇతర చెత్త కారణంగా రహదారులు మూసుకుపోవడంతో యాత్రకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 16 వరకూ చార్ ధార్ ధామ్ ను సందర్శించిన యాత్రికుల వివరాలు

బద్రీనాథ్ 9,70,610

కేదార్‌నాథ్ 8,81,265

గంగోత్రి 4,50,915

యమునోత్రి 3,46,132

Related posts

మంచిర్యాల ప్రభుత్వ దావఖాన లో హత్య

Bhavani

విజయ‌న‌గ‌రం కంటోన్మెంట్ హైస్కూలు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ దీపిక

Satyam NEWS

వసంతం అంటే

Satyam NEWS

Leave a Comment