33.7 C
Hyderabad
April 29, 2024 01: 25 AM
Slider ప్రత్యేకం

విజయ‌న‌గ‌రం కంటోన్మెంట్ హైస్కూలు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ దీపిక

#spdepikaips

రాష్ట్ర  వ్యాప్తంగా  టెన్త్ ఎగ్జామ్స్ జ‌రుగుతున్న సంగ‌తి విదిత‌మే. గ‌డ‌చిన రెండు  రోజుల నుంచీ జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి …ప‌రీక్షా కేంద్రాల‌ను సంద‌ర్శిస్తున్న సంగ‌తి కూడా తెలిసిందే. అయితే తాజాగా  టెన్త్ ప‌రీక్షా కేంద్రాల‌కు పోలీస్ బాస్ కూడా సంద‌ర్శిస్తున్నారు. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రంలోని  కంటోన్మెంట్ మున్సిప‌ల్ హైస్కూల్  లో జ‌రుగుతున్న టెన్త్ పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ దీపిక త‌నిఖీ చేసారు.

అక్క‌డున్న హెచ్.ఎం..స్పాట్ వేల్యూష‌న‌ర్ ,అలాగే కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామిన‌ర్ తో క‌లిసి  మొత్తం పాఠ‌శాల‌లో ప‌రీక్ష జరుగుతున్న విధానాన్ని ఎస్పీ ద‌గ్గ‌రుండీ కాస్త నిశితంగా ప‌రిశీలించారు. టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షల నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు… జిల్లా ఎస్పీ .దీపిక. పరీక్షా కేంద్రం వ‌ద్ద ఎలాంటి  అవకతవకలకు తావులేకుండా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లును ప‌రిశీలించారు…ఎస్పీ.

ప‌రీక్ష‌లు  సజావుగా, ప్రశాంతంగా రాసుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేప‌ట్టింది విద్యా శాఖ.అలాగే ప‌రీక్షా కేంద్రాలకు ఏ ఒక్క‌రూ సెల్ ఫోన్ లు తీసుకురావ‌డాన్న అనుమితించొద్ద‌ని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసారు..ఎస్పీ. పరీక్ష కేంద్రాల ఆవరణం లోనికి బయట వ్యక్తులు ప్రవేసించకుందా త‌మ  శాఖ సిబ్బందిచే నిర్వ‌హిస్తున్న‌ పటిష్ట భద్రతను ఎస్పీ ద‌గ్గ‌రుండీ ప‌ర్య‌వేక్షించారు.

అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌టిష్ట బందోబ‌స్తు: జిల్లా ఎస్పీ దీపిక

విజ‌య‌న‌గ‌రం  జిల్లా వ్యాప్తంగా టెన్త్ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద పోలీసు బందోబ‌స్తుతో విద్యాశాఖ ప‌రీక్ష‌లు రాయిస్తోంది. ఇందులోభాగంగా జిల్లా ఎస్పీ దీపిక‌…న‌గరంలోని కంటోన్మెంట్  మున్సిప‌ల్ హైస్కూల్ లో జ‌రుగుతున్న టెన్త్ ప‌రీక్షా కేంద్రాన్ని ఎస్పీ ప‌రిశీలిచారు.అనంత‌రం ఎస్పీ  దీపిక విలేక‌రుల‌తో మట్లాడుతూ… జిల్లాలో 181 పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు జ‌రుగుతున్నాయ‌న్నారు.

ఆయా ప‌రీక్ష‌ల‌ నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా పటిష్ఠమైన భద్రత చర్యలు చేపట్టామ‌న్నారు..ఈ మేర‌కు న‌గ‌రంలోని కంటోన్మెంట్ లోని మున్సిపల్ హై స్కూల్ ను జిల్లా ఎస్పీ సందర్శించి, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించటం లేద‌న్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని శాఖా సిబ్బందినితో పాటు ఇంచార్జ్ లు గా ఉన్న ఎస్ఐలను ఆదేశించామ‌ని  ఎస్పీ దీపికా  తెలిపారు. ఈ టెన్త్ ప‌రీక్షా కేంద్రం త‌నిఖీల‌లో ఎస్పీతో పాటు….ఏఎస్పీ, విజయనగరం సబ్ డీఎస్ఈ అనిల్ పులిపాటి, వ‌న్ టౌన్ సీఐ శ జే.మురళిలు ఉన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి

Bhavani

లంబాడి బంజారా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వద్దు

Satyam NEWS

మౌలాలీలో ఫ్రెష్ లైవ్ ఫిష్ మార్కెట్ ఓపెన్ చేసిన కార్పొరేటర్లు

Satyam NEWS

Leave a Comment