36.2 C
Hyderabad
May 7, 2024 12: 16 PM
Slider వరంగల్

ములుగు జిల్లా కు ఆర్టీసీ డిపో మంజూరు చేయాలి: DYFI

#tsrtc

ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా కు బస్ డిపో మంజూరు చేయాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ కు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా లో  మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం లేక అనేక మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో భాగంగా వరంగల్ డిపోల నుండి ములుగు కు బస్సులు వస్తున్నాయని, వరంగల్ హనుమకొండ  ప్రాంతాల నుండి ములుగు ఏటూనాగారం మంగపేట వరకు ఆయా ప్రాంతాల ప్రజలు వెళ్ళాలంటే హనుమకొండలో  ములుగు లో గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని తెలియజేశారు.

అంతేకాకుండా ములుగు జిల్లా కేంద్రం నుండి ఉదయం 5 గంటల కంటే ముందు పట్టణ ప్రాంతాలైన  వరంగల్ హనుమకొండ  హైదరాబాద్ వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదని, ములుగు జిల్లా లో బస్ డిపో ఉంటే సమస్యలు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని వారు తెలిపారు. వెంటనే ములుగు జిల్లాకు బస్ డిపో మంజూరు చేసి ములుగు ఏటూరునాగారం కేంద్రాల్లో బస్టాండ్ విస్తరింపజేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.

అదే విధంగా మేడారం వెళ్లే ములుగు ప్రాంత ప్రజల కోసం ములుగు నుండి మేడారానికి ప్రత్యేక బస్సులు కూడా నడపాలని  ప్రజలకు అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంచాలని ఆర్టిసి ఎండి ని  కోరారు. అంతేకాకుండా ములుగు జిల్లా కేంద్రంలో బస్టాండ్ లో చాలా చిన్నగా ఉండడం వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ములుగు జిల్లా కు బస్ డిపో మంజూరు చేసి జిల్లా కేంద్రంలో ఉన్న బస్టాండ్ ను విస్తరింప చేయాలని వారు కోరారు.

Related posts

త్రాగునీటి స‌మ‌స్య‌కు రూ.1.49 కోట్ల‌తో క్రాష్ ప్రోగ్రాం అమ‌లు

Satyam NEWS

నిర్మల్ ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తాం

Satyam NEWS

దళితుల జనావాసాలలో విష సర్పాలు

Satyam NEWS

Leave a Comment