32.2 C
Hyderabad
May 8, 2024 22: 44 PM
Slider జాతీయం

కోర్టు ఆదేశాలు పాటించని ఐఏఎస్ లు ఇక జైలుకే

#MadrasHighCourt

న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలు పాటించని ఐఏఎస్ అధికారులను ముందుగా జైలుకు పంపాలి. ఆ తర్వాతే కోర్టు ధిక్కరణ వ్యాజ్యం నడపాలి ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను పాటించాల్సిన బాధ్యతను విస్మరించే ఐఏఎస్ అధికారులను ముందు జైలుకు పంపాలని ఆ తర్వాతే కోర్టు ధిక్కరణ వ్యాజ్యం నడపాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వైద్యనాథన్ ఆదేశాలు జారీ చేశారు.

ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా పట్టాదారు పాస్ బుక్ లో పేర్లు నమోదు చేసిన టంకాసి రెవెన్యూ డివిజనల్ అధికారిపై చర్య తీసుకోవాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన అనంతరం తమ పాస్ బుక్ లలో కూడా తప్పులు జరిగాయని పలు కేసులు దాఖలయ్యాయి. అధికారులు సక్రమంగా తమ విధులను నిర్వర్తించాలని, అందుకే వారికి జీతాలు చెల్లిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

కేవలం కాగితాలు చూసి మాత్రమే కాకుండా అవసరమైతే వ్యక్తిగతంగా ఫీల్డ్ విజిట్ చేసి రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. చట్ట ప్రకారం నిర్ణీత గడువులోపు రైతుల అభ్యంతరాలను, దరఖాస్తులను పరిశీలించాలని లేకపోతే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.

శాఖాపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా సంబంధిత అధికారి సర్వీసు రిజిస్టర్ లో కూడా ఆ వివరాలు నమోదు చేయాలని మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related posts

బూస్టర్ డోస్ పంపిణీ కి టీకాలు సరఫరా చేయండి

Bhavani

మానవత్వం చాటుకున్న ములుగు జెడ్పీ చైర్మన్….

Satyam NEWS

ఉరకలెత్తుతున్న ఉగ్రగోదావరి

Satyam NEWS

Leave a Comment