27.7 C
Hyderabad
April 30, 2024 10: 10 AM
Slider నల్గొండ

స్త్రీ జాతి చైతన్యం కోసం పరితపించిన గుడిపాటి వెంకటాచలం

#Gudipati Venkatachalam

హైదరాబాద్ మహా నగరంలోని రవీంద్ర భారతి లో జరిగిన గుడిపాటి వెంకటాచలం పై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి మాట్లాడుతూ స్త్రీవాద రచయిత,తత్వవేత్త చలం జన్మదిన 19వ,రోజున తన సేవలను గుర్తు చేస్తూ ఒక స్త్రీ తన మనోవేదన ఏ విధంగా పడుతుందో అభివ్యక్తీకరించిన ప్రఖ్యాత రచయిత చలం అని విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చీకూరి లీలావతి అన్నారు.

స్త్రీకి స్వాతంత్ర్యం లేదనే నానుడిని చలం వ్యతిరేకించారని,స్త్రీ స్వాతంత్ర్యాన్ని కాంక్షించారు.స్త్రీకి కూడా మనసు ఉంటుందని,తన అభిప్రాయాలను గౌరవించేవారని లీలావతి అన్నారు. చిన్నతనంలో బాల్య వివాహం,స్త్రీకి చదువు అవసరం లేదనే సమాజంలో చలం తన భార్యని పాఠశాలలో వదిలి తాను కాలేజీకి వెళ్లేవారని,నాటి నుండే ఆయన ఎన్నో విప్లవ భావాలతో స్త్రీల కోసం అనేక సాహిత్యాలు సృష్టించాలని అన్నారు.

తన జీవితాన్ని స్త్రీ జాతి చైతన్యం కోసం,స్త్రీ జాతి విముక్తి కోసం అంకితం చేసిన మహనీయుడు చలం అని లీలావతి అన్నారు.స్వాతంత్రోద్యమ కాలంలో స్త్రీల యొక్క సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని అనేక నవలలను వ్రాశారు,చలం సమాజంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కు,సమాన స్వేచ్ఛ ఉండాలని తన రచనల ద్వారా తెలిపిన మొట్ట మొదటి మొదటి తరం స్త్రీవాద కవి చలం అని,ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను తిరగరాస్తుందని,స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వాలు పురుషులతో పాటు సమానంగా ఉండాలని వాదించిన మొట్టమొదటి కవులలో గుడిపాటి వెంకటాచలం ఒకరని చీకూరి లీలావతి అన్నారు.

స్త్రీ ఇంత స్వేచ్ఛగా తిరుగుతుందంటే ఆనాటి మహానుభావులే కారణమని,గుడిపాటి వెంకటాచలం రచనలు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు లీలావతి చీకూరి అన్నారు.
ఈ కార్యక్రమంలో మహా కవులు, ఉభయ తెలుగు రెండు రాష్ట్రాల వారు నగరముని,ఘంటసాల నిర్మల తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంలో పండగపూట ఇండ్లలోకి మురికి నీరు

Satyam NEWS

తెలంగాణలో పోటీ నుంచి వైదొలగిన వైఎస్ షర్మిలారెడ్డి

Satyam NEWS

రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు

Murali Krishna

Leave a Comment