40.2 C
Hyderabad
May 2, 2024 16: 36 PM
Slider ముఖ్యంశాలు

కవితను మళ్లీ విచారించనున్న ఈడీ అధికారులు

#kavita

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రేపు కూడా ప్రశ్నించనున్నారు. నేడు దాదాపు 7 గంటలకు పైగా విచారించి ఆమె సంతకాలు తీసుకున్నారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు తీసుకున్నారు. అయితే ఈడీ అధికారులు సంతకాలు ఎందుకు తీసుకున్నారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అరెస్ట్ చేసేందుకా లేక విచారణ ముగిసిందని చెప్పేందుకా అనేది తెలియాల్సి ఉంది. ఈడీ కార్యాలయం వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కవిత అరెస్ట్ అవుతారా లేక బయటకు వస్తారా అనే విషయంలో టెన్షన్ కొనసాగింది. చివరకు ఆమె బయటకు వచ్చినా ఆమె ఎంతో ముభావంగా ఉన్నారు. కవితను ఈ ఉదయం 11 గంటల నుంచి ఈడీ అధికారులు విచారించారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది.

కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. కవితతో నేడు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో కలిపి విచారించడం వల్ల విచారణలో జాప్యం జరిగింది.

Related posts

విజయనగరంలో ఒకే రోజు ముగ్గురు సీఐల బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS

కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

Leave a Comment