40.2 C
Hyderabad
May 2, 2024 16: 51 PM
Slider ముఖ్యంశాలు

Delhi Liquor Scam: ఆంధ్రప్రభ ఆఫీసులో ఈడీ సోదాలు

#andhraprabha

ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న సోదాలలో భాగంగా హైదరాబాద్ లోని ఆంధ్రప్రభ దిన పత్రిక కార్యాలయంపై కూడా దాడి చేసింది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన డబ్బులను ఆంధ్రప్రభ నిర్వహించే ఒక ఇంగ్లీష్ దినపత్రికలో, ఒక న్యూస్ ఛానెల్ లో పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ విచారణలో తేలింది. దాంతో ఆంధ్రప్రభ యజమాని ముత్తా గోపాల కృష్ణ ఇల్లు, ఆయన కార్యాలయం పై ఈడీ దాడి చేసి సోదాలు నిర్వహించింది.  జూబ్లీహిల్స్​లోని ఆంధ్రప్రభ కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలో ఉన్న ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

లిక్కర్ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆంధ్రప్రభ నిర్వహిస్తున్న ఛానల్​లో, ఇంగ్లీష్ పత్రికలో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లితో పాటు మరో రెండుచోట్ల సోదాలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణకు చెందిన ఈ మీడియా హౌస్ కు పంజాబ్ నుంచి రూ.20 కోట్లు బదిలీ అయినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.

ఈ పెట్టుబడులు అభిషేక్ రెడ్డి ద్వారా వచ్చినట్లుగా కూడా ఈడీ వివరాలు సేకరించింది. హైదరాబాద్ లో మీడియా హౌస్ పైనా, దాని యజమానిపైనా ఈడీ దాడులు చేయడం, అదీ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తున్నది.

Related posts

కాకతీయ కాల్వలో ఇద్దరు యువకుల గల్లంతు

Satyam NEWS

నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచి వుంచుకోవచ్చు

Satyam NEWS

సమస్యను పెద్దది చేస్తున్న అధికార పార్టీ నాయకులు

Satyam NEWS

Leave a Comment