ఈత సరదా ఇద్దరి ప్రాణం తీసింది. సరదాకు కాలవలోకి దిగిన ఇద్దరు యువకులు నిట్టనిలువుగా మునిగిపోయారు. కాకతీయ కాలువలో ఈ దుర్ఘటన జరిగింది. కరీంనగర్ జిల్లా అల్గునూర్ శివారు లోని కాకతీయ కాలువలో స్నానానికి వచ్చిన రిజ్వానొద్దిన్(16), అబ్దుల్ కరీం (27) అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్ కుమారుడు రిజ్వాన్, బావ మరిది కరీం గా స్థానికులు చెబుతున్నారు. గల్లంతయిన ఇద్దరు యువకుల కోసం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.
previous post