33.7 C
Hyderabad
April 29, 2024 00: 39 AM
Slider ముఖ్యంశాలు

సమస్యను పెద్దది చేస్తున్న అధికార పార్టీ నాయకులు

#dkaruna

మేళ్లచెరువు గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా రహదారి సమస్యను పరిష్కరించాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ అన్నారు. ఆదివారం గ్రామాన్ని అరుణమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆర్ యూ బి ద్వారా పడుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వర్షాకాలం వచ్చిందంటే ఆర్ యు బి లోకి పెద్ద ఎత్తున నీళ్లు చేరుతున్నాయని దాని కారణంగా బయట కు రాకుండా  తమకు సంబంధాలు తెగిపోతున్నాయని వివరించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తమ పరిస్థితి అంతేనని గోడును వెళ్లబోసు కున్నారు. మరో బ్రిడ్జి గుండా పూర్వం నుండి దారి ఉందని దానిని ప్రస్తుతం అధికార పార్టీ నాయకుల అండదండలతో మూసివేసారని డికె.అరుణమ్మ దృష్టికి తీసుకువచ్చారు.

దీంతో స్పందించిన డికె. అరుణమ్మ టిఆర్ఎస్ పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామ ప్రజలు దారి కోసం గత కాలం నుండి అడుగుతున్న పరిష్కరించకుండా మరింత కఠినం చేయడంపై ఆమె ఆక్షేపించారు. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి గతంలో ఉన్న రహదారిని ప్రజలకు చూపించాలని కోరారు జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించాలని ఆమె సూచించారు.

రైల్వే అధికారులు ఆర్ యు బి లో వర్షాకాలంలో నిలుస్తున్న నీటిని ఎప్పటికప్పుడు పంపించే విధంగా చూడాలన్నారు. ఇందుకోసం సీనియర్ ఇంజనీర్ అధికారులు పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం ఆర్ యు బి లో వర్షం చేరితే మోటార్ల సహాయంతో తోడు వేయాల్సి ఉందని దీనివలన ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైల్వే అధికారులు పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ టి రామాంజనేయులు ,జిల్లా బిజెవైఎం అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి,కౌన్సిలర్ త్యాగరాజు, బిజెపి సీనియర్ నాయకులు రజక నరసింహులు,పుడూర్ నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, రాముడు, వెంకటన్న, రామకృష్ణ, సుధాకర్ నాయుడు,రాజేష్ తదితరులు ఉన్నారు.

Related posts

అమ్మలేదు… నాన్నను కరోనా మింగింది… అయితేనేం… మేమున్నాం

Satyam NEWS

కర్నాటకలో భారీగా నగదు ఆభరణాలు స్వాధీనం

Satyam NEWS

ఆదివాసీలకు ఉచిత వైద్యం అందించిన రెడ్ క్రాస్ సంస్థ

Satyam NEWS

Leave a Comment