31.7 C
Hyderabad
May 2, 2024 08: 22 AM
Slider ప్రత్యేకం

ద‌క్షిణ తెలంగాణ‌పై కేసీఆర్ శీత‌క‌న్ను: కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

#komatireddy venkatreddy

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు తీసుకురాలేని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఉంటే ఎంత లేకుంటే ఎంత‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. న‌ల్గొండ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నకిరేకల్ నియోజక వర్గం నార్కెట్‌ప‌ల్లి వివేరా హోట‌ల్‌లో శనివారం విలేఖ‌రుల‌తో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ద‌క్షిణ తెలంగాణ‌పై సీఎం కేసీఆర్ చిన్న‌చూపు చూస్తుంటే ప్ర‌శ్నించాల్సిన మంత్రులు బానిస బ‌తుకులు బ‌తుకుతున్నార‌ని విమ‌ర్శించారు. 7ఏళ్లు మంత్రిగా ఉండి 100 కోట్లు తీసుకురాలేని చేత‌కాని మంత్రి ఉండి ఎందుకుని దుయ్య‌బ‌ట్టారు. నిధులు ఇవ్వ‌కుండా ఈ ప్రాంతాన్ని బీడుగా మారిస్తే ఎందుకు గొత్తెత్త‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు.. మంత్రి ప‌ద‌వికి నువ్వు అర్హుడివా అని జ‌గ‌దీష్ రెడ్డిని ప్ర‌శ్నించారు. జిల్లాలో తిర‌గాలంటే భ‌యంతో పోలీసుల ప‌హారాలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. తెలంగాణ హ‌క్కుల‌న‌ను కాల‌రాసే విధంగా కేంద్రం గెజిట్‌లు విడుద‌ల చేస్తున్నా… కేసీఆర్ స్పందించ‌డం లేద‌న్నారు.

95 శాతం పూర్త‌యిన బ్ర‌హ్మ‌ణ వెల్లంల ప్రాజెక్టు మిగిలిన ప‌నుల‌కు రూ. 100 కోట్లు కేటాయిస్తే ల‌క్ష ఎక‌రాల‌కు నీళ్లు వ‌స్తుంద‌ని తెలిపారు. దీని వ‌ల్ల ఫ్లోరైడ్ ప్ర‌భావిత ప్రాంతాలైన నార్కెట్‌ప‌ల్లి, చిట్యాల‌, క‌ట్టంగూర్, న‌ల్గొండ  మండ‌లాలా ప‌రిధిలో భూములు శాశ్య‌సమ‌లం అవుతాయ‌న్నారు. బ్ర‌హ్మ‌ణ వెల్లంల ప్రాజెక్ట‌కు100 కోట్లు ఖర్చు చేస్తే ల‌క్ష ఎక‌రాల‌కు నీళ్లు ఇయ్యే ప్రాజెక్టుపై స‌వ‌తి ప్రేమ ఎందుకని ప్ర‌శ్నించారు.

ఎల్ఎల్‌బీసీ సొరంగం ప‌నులు కాంగ్రెస్ హ‌యంలో రూ. 1300 కోట్లు తీసుకువ‌చ్చి 70శాతం ప‌నులు పూర్తిచేయిస్తే ఏడేళ్ల కాలంలో టీఆర్ఎస్ స‌ర్కార్ ఒక్క రూపాయి విడుద‌ల చేయ‌డం లేద‌ని మండిప‌డ్డారు. 2014 ఎన్నిక‌ల్లో కుర్చీ వేసుకుని సొరంగం పనులు పూర్తి చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్  ఇప్పుడు మాట మాట్లాడ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

ఉత్త‌ర తెలంగాణకు ల‌క్ష 10వేల కోట్లు పెట్టి ఎక్క‌డో ఉన్న గోదావ‌రిని తీసుకువ‌చ్చారు. ద‌క్షిణ తెలంగాణ‌ను మాత్రం బీడు భూములుగా మారుస్తున్నార‌ని తెలిపారు. ఉత్త‌ర తెలంగాణ‌లోని కాలువ‌ల‌ను వేల కోట్ల‌తో లైనింగ్ పనులు చేస్తూ ఎఎమ్ఆర్ కెనాల్ లైనింగ్‌కు రూ. 200 కోట్లు ఇవ్వ‌కుండా శీత‌క‌న్ను వేస్తున్నారన్నారు.

పెద్ది నరేందర్, నకిరేకల్, సత్యం న్యూస్

Related posts

ఆమంచి కుటుంబం బెదిరింపులపై ఫిర్యాదుల ‘‘మాయం’’ కేసు విచారణ షురూ

Satyam NEWS

అధికార పార్టీ నేత బంధువట రోడ్డును ఆక్రమించేస్తున్నాడు

Satyam NEWS

వనపర్తి జిల్లా పోలీసు ప్రజావాణిలో 6 ఫిర్యాదులు

Bhavani

Leave a Comment