40.2 C
Hyderabad
April 28, 2024 18: 17 PM
Slider సంపాదకీయం

ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభం

#Chief Minister YS Jagan

తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలను, జారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పది మెట్లు కిందికి దిగారు. పార్టీలో ఇటీవల చెలరేగిన కల్లోలాన్ని చల్లార్చేందుకు ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దాదాపు 44 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, వారికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేది లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్న ఆయన నేడు జరిగిన సమావేశంలో పూర్తి క్లారిటీ ఇచ్చారు.

అందరు ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. మంత్రులు ఎమ్మెల్యే లతో నేడు జరిగిన సమావేశం లో సీఎం జగన్ ఎంతో ఓపికతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను అనునయిస్తున్నట్లు ఆయన మాట్లాడటం పై ఎమ్మెల్యేలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు గతంలో జరిగిన సమావేశాలలో తీవ్ర స్థాయిలో వార్నింగ్ లు ఇచ్చారు. అయితే ఈ సారి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో ఎంతో సామరస్యంగా మాట్లాడటం గమనార్హం. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి చావు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నలుగురు ఎమ్మెల్యేలను కూడా వైసీపీ సస్పెండ్ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఈ ఎన్నికలలో సునాయాసంగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు రాబట్టుకొన్న వైసీపీ, తన సొంత ఎమ్మెల్యేలను నలుగురిని చేజార్చుకున్నది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలలో ఒక విధమైన అభద్రతా భావన నెలకొన్నది. సుమారు 40 మందికి టిక్కెట్లు రావనే వార్తలను బలంగా నమ్మిన వైసీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీ అధినేతతో టచ్ లోకి వెళ్లారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. దాంతో వైసీపీలో తీవ్రమైన కలకలం చెలరేగుతున్నది.

దానికి తోడు కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేకు పోటీగా ఇన్ చార్జిలను, సహ ఇన్ చార్జిలను నియమించిన వైసీపీ అధిష్టానం ఈ అభద్రతా భావాన్ని మరింతగా పెంచింది. వెరసి వైసీపీలో రాజకీయ కల్లోలం చెలరేగింది. ఈ దశలో ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం జగన్ వారితో ఎంతో అనునయంగా మాట్లాడారు. అందరికి టిక్కెట్లు ఇస్తామని పరోక్షంగా వారికి హామీ ఇచ్చారు. సీఎం జగన్ చెప్పిన మాటల ప్రభావం ఎంత వరకూ ఉంటుందో మరి కొద్ది రోజులు వేచి చూస్తే కానీ తెలియదు.

Related posts

ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు మధ్యలోనే డ్రాప్ అవుతారు

Satyam NEWS

అన్నదాతల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం

Sub Editor

రాజయోగం సినిమాతో రెండు గంటలు వినోదం గ్యారెంటీ

Bhavani

Leave a Comment