25.2 C
Hyderabad
May 8, 2024 08: 38 AM
Slider మహబూబ్ నగర్

వయసు మళ్లిన వాళ్లు దేవుళ్ళతో సమానం

#Kalwakurthy Judge

కనీ పెంచిన తల్లిదండ్రులను కనికరం లేకుండా గెంటేస్తున్న పరిస్థితులు నేడు. కదలేని స్థితిలో ఉన్న వృద్ధులకు సేవలు చేసేందుకు ఎంతో ఓపిక, సహనం కావాలని కల్వకుర్తి  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అర్పిత మారం రెడ్డి అన్నారు.

పండుటాకులకు చరమాంకంలో చేరదీయడం అభినందనీయమని, ఇలాంటి తరుణంలో వృద్ధులను చేరదీసి తల్లిదండ్రులవాలే చూసుకుంటున్న  ప్రజల భాగస్వామ్య సంస్థ నిర్వాహకులు వెంకటయ్య ను జడ్జి అభినందించారు.

 ఆదివారం న్యాయమూర్తి అర్పిత మారం రెడ్డి  కల్వకుర్తి వృద్ధాశ్రమంలో  వివిధ రకాల పండ్లను, ఇతర వస్తువులను కుటుంబ సభ్యులతో కలిసి వృద్దులకు  పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జీవితం చివరిదశలో ఉన్న

వృద్ధులకు అండగా నిలవాలని అన్నారు. ఆర్థిక భారం అయినప్పటికీ సేవా భావంతో వృద్ధాశ్రమం  నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అనంతరం న్యాయమూర్తి వృద్ధుల తో మాట్లాడి యోగక్షేమాలు  తెలుసుకున్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు వెంకటయ్య, మేనేజర్ మల్లేష్ , కౌన్సిలర్ పరుశరాములు, వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుపతి పవిత్రతకు “విఘాతం” కలిగించకండి

Satyam NEWS

అందరి మనసుల్లో గుర్తుండిపోయే సినిమా “గుర్తుందా శీతాకాలం”

Bhavani

‘బీరం’ రగడ మళ్లీ మొదలు.. డీఈఓ పై తీవ్ర ఆరోపణ..

Satyam NEWS

Leave a Comment